Thursday, May 2, 2024

Flash: ఫిలిప్పీన్స్‌లో ఘోర అగ్ని ప్రమాదం.. చిన్నారులు సహా 8 మంది సజీవదహనం

ఫిలిప్పీన్స్‌లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 8 మంది సజీవదహనం అయ్యారు. మెట్రో మనీలాలోని స్టేట్ యూనివర్శిటీ క్యాంపస్‌లోని నివాస ప్రాంతంలో సోమవారం తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాదంలో కనీసం ఎనిమిది మంది మరణించారు. మృతుల్లో ఆరుగురు చిన్నారులు కూడా ఉన్నారు. తెల్ల‌వారుజామున 5 గంట‌ల‌కు ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు చెబుతున్నారు. క్వీజ‌న్ సిటీలోని యూనివ‌ర్సిటీ క్యాంప‌స్‌లో ఉన్న బ‌స్తీలో ఈ ప్ర‌మాదం జ‌రిగింది. ఒకే ఇంట్లో చిన్నారులు సహా ఆరుగురు మృతి చెందారు. మొత్తం 80 ఇండ్లు ధ్వంసం అయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement