Friday, April 26, 2024

Petrol Prices: మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. నేటి రేట్లు ఇవీ

దేశంలో పెట్రోలు ధరలు భగ్గుమంటున్నాయి. రోజు రోజుకు ధరలు పెరుగుతున్నాయి. తాజాగా మంగళవారం లీటర్ పెట్రోల్ పై 35 పైసలు, లీటర్ డీజిల్ పై 35 పైసలు పెరిగింది. ఈ పెరుగుదలతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 110.04 చేరగా.. లీటర్ డీజిల్ ధర రూ. 98.42 కు చేరింది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 115.85 చేరగా.. డీజిల్ ధర రూ. 106.62 కు ఎగసింది. ఇక హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ. 114. 12 చేరగా.. డీజిల్ ధర రూ. 107. 40గా ఉంది. విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ. 116. 27 ఉండగా.. డీజిల్‌ ధర రూ. 108. 89కి చేరింది. కోల్‌ కత్తాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 110.49 చేరగా.. డీజిల్ ధర రూ. 101.56 కు చేరింది. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 106.66 చేరగా.. డీజిల్ ధర రూ. 99.92 కు చేరింది. పెరుగుతున్న పెట్రో ధ‌ర‌లతో సామాన్యుడికి చుక్కలు కనిపిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement