Sunday, May 5, 2024

నామినేష‌న్స్ లో 10మంది..ష‌ణ్ముఖ్ సేఫ్..

బిగ్ బాస్ హౌస్ లో నామినేష‌న్ ప్ర‌క్రియ స్టార్ట్ అయింది. లోబో ఎలిమినేట్ అయిన సంగ‌తి తెలిసిందే. కాగా ఈ నామినేష‌న్స్ లో ఎవ‌రెవ‌రు ఉన్నారో చూద్దాం..హౌస్ లో ఉన్న పది మందిలో నామినేషన్స్ నుంచి సేవ్ కావడానికి ఇమ్యునిటీ టాస్క్ ఇచ్చారు. ఆ టాస్క్‌లో నామినేషన్స్‌లో ఉన్న 10 మంది పోటీ పడుతున్నారు.ఇక నామినేష‌న్ ప్ర‌క్రియలో సన్నీ.. సిరి, జెస్సీలను నామినేట్ చేశాడు. విశ్వ.. ప్రియాంక, మానస్‌లను నామినేట్ చేశాడు.ప్రియాంక గురించి మాట్లాడుతూ. నువ్వు నా కండబ‌లం గురించి మాట్లాడుతూ నామినేట్ చేయ‌డం బాగోలేద‌ని అన్నాడు. కాజల్.. రవి, శ్రీరామ చంద్రలను నామినేట్ చేసింది.

ర‌వి నీతో సెట్ చేసుకోవాలనే ఉంటుంది కానీ.. సెట్ చేసుకోనివ్వవు. నిన్ను ఎదగనీయకుండా చేయడానికి నేను ట్రై చేయలేదు.. హౌస్‌‌లో కూడా ఎవరూ నిన్ను ఎదగనీయకుండా చేయలేరు అనే స‌రికి ర‌వి ఆ మాట‌ల‌కు ధీటుగా స్పందించాడు. అనీ మాస్ట‌ర్ .. ఫ్రెండ్స్‌ని చెంచా అని అంటారా అని అడిగింది కాజ‌ల్‌. అవును చెంచాస్ చెంచాస్ అని అంటార‌ని చెప్పింది. ఇక ఆనీ మాస్టర్.. సిరి, కాజల్‌లను నామినేట్ చేసింది. కెప్టెన్సీ టాస్క్‌లో జేబులో నుంచి కత్తి పెట్టుకున్నావ్. ఆ కత్తి ఎవరికైనా గుచ్చుకుంటే పరిస్థితి ఏంటి అంటూ సిరిని నామినేట్ చేసింది.

అనంతరం కాజల్‌.. నువ్ నన్ను నామినేట్ చేయకపోయినా నేను నిన్ను చేస్తా అని చెప్పి మరీ నామినేట్ చేసి షాక్ ఇచ్చింది ఆనీ మాస్టర్. షణ్ముఖ్.. మానస్, ప్రియాంకలను నామినేట్ చేశాడు. ప్రియాంకను నామినేట్ చేస్తూ.. నీ ఆట నువ్ ఆడు అని చెప్పాడు. న‌న్ను ఆట బాగా ఆడు అని చెప్పేవాడివైతే.. ఈ నామినేషన్ చేయవు.. నేను వెళ్లిపోతే నా ఆట ఎవరు ఆడతారు అన్నయ్యా అని అడిగింది. ఇక ష‌ణ్ముఖ్ క్రీమ్ పూస్తున్న స‌మ‌యంలో త‌న ఫేస్‌కి దానిని గట్టిగా కొట్టుకుంది. ఇలా నామినేష‌న్ ప్ర‌క్రియ మొత్తంగా పూర్త‌య్యే స‌రికి 9వ వారం నామినేషన్స్‌లో భాగంగా.. మానస్, సన్నీ, శ్రీరామ్, సిరి, కాజల్, ప్రియాంక, రవి, జెస్సీ, ఆనీ మాస్టర్, విశ్వ ఈ పది మంది నామినేట్ అయ్యారు. కెప్టెన్ షణ్ముఖ్ ఒక్కడికే మినహాయింపు ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement