Friday, April 26, 2024

పేటీఎం అదిరే ఆఫర్లు.. గ్యాస్​ బుకింగ్​పై క్యాష్​బ్యాక్​..

వంట గ్యాస్ ధర పెరుగుతూ సామాన్యులకు చుక్క‌లు చూపిస్తోంది. అయితే ఇట్లాంటి సిచ్యుయేష‌న్‌లో తక్కువ ధరకే సిలిండర్ బుక్​ చేసుకునే చాన్స్ వ‌స్తే ఎవ‌రు కాదంటారు…ఇప్పుడా అవ‌కాశం పేటీఎం యాప్ క‌ల్పిస్తోంది.. మరి ఆదేలా సాధ్యమో చ‌దివి తెలుసుకోండి..

పేటీఎం ద్వారా గ్యాస్ సిలిండర్​ బుక్ చేసుకుంటే అసలు ధరకన్నా తక్కువకే సిలిండర్ పొందే వీలుంది. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం.. రూ.2,700 వరకు ఈ ఆఫర్ ద్వారా ఆదా చేయొచ్చు. ఈ ఆఫర్ మూడు ప్రధాన ఎల్​పీజీ గ్యాస్ సర్వీసులందించే కంపెనీలైన హెచ్​పీ, భారత్​, ఇండెన్​ గ్యాస్​లకు వర్తిస్తుంది. ‘3 పే 2700’ ఆఫర్​లో భాగంగా ఈ క్యాష్​ బ్యాక్ పొందొచ్చు. తాజాగా మూడు సిలిండర్లు బుక్ చేసుకుంటే.. రూ.3000 వేల వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్​ను కూడా అందుబాటులోకి తెచ్చింది పేటీఎం. ఇందులో కనీసం రూ.900 కచ్చితమైన క్యాష్​ బ్యాక్​ ఆఫర్​ అందుబాటులో ఉంచింది.

ఇంకొన్ని ప్రయోజనాలు..
దీంతో పాటు వినియోగదారులు ఎవరైతే అనివర్య కారణాల వల్ల బుకింగ్ బిల్లు చెల్లించలేకపోతే.. పే లేటర్ ఆఫ్షన్​ను కూడా అందిస్తోంది. పే లేటర్ ఆప్షన్ ఎంచుకుంటే.. వచ్చే నెలలో ఆ బిల్లును పే చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం పేటీఎం ‘పోస్ట్ పేయిడ్​’ సేవలు అందిస్తోంది. వీటితో పాటు ప్రస్తుతం పరిస్థితుల్లో ఏజెన్సీకి వెళ్లకుండానే గ్యాస్ బుక్ చేసుకునే వీలు కూడా కలుగుతోంది. దీని ద్వారా సులభంగా గ్యాస్ హోం డెలివరీ పొందొచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement