Saturday, April 20, 2024

క్రికెట్ ఫ్యాన్స్ కి షాక్ : ఒలింపిక్స్ లో నో ఛాన్స్

2028లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ లో క్రికెట్ ఆట‌ను చేర్చేందుకు చేస్తున్న ప్ర‌య‌త్నాల‌కి షాక్ త‌గిలింది. క్రికెట్ తో పాటు బాక్సింగ్, వెయిట్ లిఫ్టింగ్ , ఆధునిక పెంటాథ్లాన్ ఒలింపిక్స్ ఎంపిక చేసిన 28క్రీడ‌ల ప్రాథ‌మిక జాబితాలో చోటు కోల్పొయింది క్రికెట్. ఒలింపిక్స్ లో క్రికెట్ ను చేర్చే దిశ గా… ఐసీసీ ఈ ఆగ‌స్టు నుంచి ప్ర‌య‌త్నాలు ప్రారంభించింది. అయితే.. ఈ క్రీడ ప్రాచుర్యం… యువ‌త‌లో క్రేజ్ ను దృష్టి లో పెట్టుకుని.. భ‌విష్య‌త్ లో ఐవోసీ క్రికెట్ ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవ‌చ్చు. 1900 పారిస్ క్రీడ‌ల్లో… మాత్ర‌మే.. ప్రాతినిథ్యం వ‌హించిన క్రికెట్‌.. 2028 ఒలింపిక్స్ లో ఖ‌చ్చితంగా ఉంటుంద‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ చివ‌రికి క్రికెట్ కు ఈ సారి కూడా చోటు ల‌భించ‌లేదు. దీంతో… క్రికెట్ అభిమానులు తీవ్ర నిరాశ కు గుర‌య్యారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement