Friday, May 3, 2024

కుదిరితేనే పొత్తులు – లేకుంటే ఒంట‌రే – ప‌వ‌న్ క‌ల్యాణ్..

ఒక తరాన్ని మేల్కొలుపుతున్నా
అమ్ముడుపోవద్దు… భవిష్యత్తు నేనిస్తా
ఇప్పటికంటే బెటర్‌ పథకాలిస్తాం
నేను బతికున్నంత వరకు యుద్ధం చేస్తా
యువశక్తిలో యువత కోసం తీర్మానం
ఉత్తరాంధ్ర ప్రజల కోసం భరోసా తీర్మానం
రణస్థలం వేదికగా యువశక్తి కార్యక్రమంలో పవన్‌

రణస్థలం, ప్రభన్యూస్‌ బ్యూరో: జనసేన పార్టీ శ్రీకాకుళం జిల్లా రణస్థలం వేదికగా నిర్వహించిన యువశక్తి కార్యక్రమంలో రానున్న ఎన్నికల్లో పొత్తులకు సంబంధించి ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ స్పష్టత నిచ్చారు. తమ గౌరవం తగ్గకుండా, లొంగుబాటు లేకుండా ఉండేట్లయితే పొత్తులకు ఓకే అంటామని చెప్పారు. లేకుంటే ఒంటరిగానే బరిలోకి దిగుతామని అన్నారు. టీడీపీ గతంలో తనను తిట్టినప్పటికీ, ఒక పెద్ద రాక్షసుడ్ని ఎదిరించాలంటే మిగిలిన శత్రువులను కూడా కలుపుకొని వెళ్లాలని, అందుకని టిడిపితో సర్దుబాటు తప్పదని అన్నారు. గత ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా జనసేనకు 6.9 శాతం ఓట్లు వచ్చాయని, అవన్నీ ఒక్కచొటే వచ్చి ఉంటే అసెంబ్లిdలో పోరాడడానికి కావాల్సిన సీట్లు వచ్చేవని అన్నారు. ఓట్లు చీలినందువల్ల వైసిపి 53 సీట్లలో టెక్నికల్‌గా గెలిచిందని, ఆ పరిస్థితి రాకుండా చూసేందుకే తాను ఓటు చీలినివ్వకూ డదనే వ్యూహాన్ని అమలు చేయబోతున్నట్లు చెప్పారు. అయితే ఎన్ని సీట్లు అనే విషయం తాను ఇప్పుడే చెప్పనని అన్నారు. కాగా ఒంటరిగా వెళ్లి వీరమరణం పొందాల్సిన అవసరం లేదన్నారు. ఒంటరిగా వెళ్తే పూర్తి మెజార్టీ వస్తుందని తనకు నమ్మకం కుదిరితే ఒంటరిగానే వెళ్తానన్నారు. ముఖ్యమంత్రి అవుతానని తాను చెప్పలేనని, అది ప్రజలే చెప్పాలని, ప్రజల ందరూ కోరుకుంటేనే జరుగుతుందని అన్నారు. తనకు ఏ అధికారం ఇవ్వకున్నా ఎప్పుడూ ప్రజలకు ఊడిగం చేస్తానని చెప్పారు.

వైసిపి ప్రభుత్వం ఇచ్చే వాటి కన్నా మంచి పథకాలు
తాము ఒంటరిగా గానీ, లేక మిశ్రమ ప్రభుత్వంగా గానీ అధికారంలోకి వస్తే వైసిపి ప్రభుత్వం ఇస్తున్న పథకాలను తొలగించబోమని అన్నారు. ఇంకా వాటి కన్నా మంచి పథకాలను అందిస్తామన్నారు. ప్రస్తుతం వైసిసి వివిధ పథకాల ద్వారా రోజుకు 24 రూపాయల నుండి 50 రూపాయల వరకే అందిస్తోందని, ఇటువంటి చిన్న మొత్తాలకు అమ్ముడు పోవద్దని, తాము మంచి భవిష్యత్తును ఇస్తామని, తమపై నమ్మకముంచి ఓట్లు వేయాలని కోరారు. అయితే సంక్షేమ పథకాల తోపాటు అభివృద్ది కూడా ముఖ్య మేనన్నారు. ఉత్తరాంధ్ర వలసలను ఆపుతామని, మత్స్యకారులకు జెట్టీలు కట్టిస్తామని, యువతకు ఇక్కడే ఉత్తరాంధ్రలోనే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని, గంజాయి సాగులో ఉన్న యువతను సంస్కరించి వారిని మంచి యువకులుగా తీర్చిదిద్దుతామని హామీ నిచ్చారు. తాను ప్రజల కోసం పని చేసే మనిషినని, తాను సినిమాలు చేసుకుంటే రోజుకు కోటి రూపాయలు సంపాదిస్తానని, కానీ ప్రజల కోసం తాను రోడ్డుపైకి వచ్చానని, ప్రజలు, యువకులు కూడా తనకు అండగా నిలవాలని, రానున్న ఎన్నికలు ఎంతో కీలకమని, జనసేనకు ఓటేసి గెలిపించాలని కోరారు.

రాష్ట్రాన్ని ముక్కలు చేస్తామం టే ముక్కలు కింద కొడతాం
ఉత్తరాంధ్రలో యువత ధైర్యంగా ముందుకు కదలాలని, వైసిపి గూండాగిరిని ఎదిరించాలని పవన్‌ కళ్యాణ్‌ పిలుపునిచ్చారు. యువత బయటకు వచ్చి వైసిపి అరాచకాన్ని ప్రశ్నించకుంటే ఉత్తరాంధ్రకు భవిష్యత్‌ ఉండదని అన్నారు. తాను సుఖవంతమైన జీవితాన్ని వదులుకొని ప్రజల కోసం రోడ్డుపైకి వచ్చాయని, అలాగే యువత, ప్రజలు కూడా భయాన్ని వదిలేసి వైసిపి ప్రభుత్వానికి ఎదురుతిరగాలని అన్నారు. ఉత్తరాంధ్రలో కొద్దిమంది నేతలు అధికారాన్ని తమ గుప్పిట్లో పెట్టుకొని ఇష్టానుసారం దోచుకుంటున్నారని, ఇప్పుడు వీరు కొత్తగా ఉత్తరాంధ్రను రాష్ట్రం చేయాలని అంటున్నారని, ఇదేమన్నా తమషా అని ప్రశ్నించారు. ఇప్పటికే రెండు ముక్కలుగా విడిపోయిన రాష్ట్రాన్ని మరో మూడు ముక్కలు చేయాలని చూస్తున్నారని, రాష్ట్ర సమగ్రతను కోరుకునే తాము దీనికి ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమన్నారు. రాష్ట్రాన్ని ముక్కలుగా చేయాలనుకునే వారిని ముక్కలు కింద కొడతామని హెచ్చరించారు.

- Advertisement -

మూడు ముక్కల సిఎం జగన్‌
వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఓ మూడు ముక్కల సిఎం అని పవన్‌ కళ్యాణ్‌ ఎద్దేవా చేశారు. తనపై పదే పదే వ్యక్తిగత దూషణలు చేయిస్తున్నారని, తాను విడాకులు ఇచ్చిన తర్వాతనే పెళ్లిళ్లు చేసుకున్నానని, జగన్‌మోహన్‌ రెడ్డి స్కూళ్లో చదివే రోజుల నుండే ఎటువంటి వాడో తనకు తెలుసునని, వైసిపి నాయకులందరితో పోల్చుకుంటే వ్యక్తిగత ంగా తానెంతో బెటరని, వారితో పోల్చుకుంటే తనను దేవుడిగా భావించి కాళ్లకు దండం పెట్టాలని అన్నారు. పదే పదే తనను ప్యాకేజీకి అమ్ముడు పోయావని అంటున్నారని, 20 కోట్లకు పైగా పన్నులు కట్టే తనకు ప్యాకేజీలకు అమ్ముడు పోవాల్సిన అసవరం లేదన్నారు. నేను డబ్బులు తీసుకున్నానని మళ్లిd అంటే మీరంతా కలిసి వైసిపి నేతలను చెప్పుతో కొట్టండంటూ కార్యకర్తలకు పవన్‌ కళ్యాణ్‌ పిలుపునిచ్చారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డితోనే తాను తలపడిన వాడిననని, అన్ని తెగించే ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చానని, ప్రాణాలు పోయినా వెనకాడేది లేదని అన్నారు. మూడు ముక్కల సిఎం జగన్‌ ఓ సైకో పాథ్‌ అని, యాంటీ సోషల్‌ అని, ఇర్రేషనల్‌, ఇల్లిdగల్‌, క్రూయల్‌ అంటూ ధ్వజమెత్తారు. రాజు మంచి వాడు కాకుంటే సగం రాజ్యం పోతుందని, అదే సలహాలు ఇచ్చేవాడు సజ్జల అయితే మొత్తం రాజ్యం పోతుందని చురకులు అంటించారు.

తుదిశ్వాస వరకు రాజకీయాల్లోనే
తాను తుదిశ్వాస ఉన్నంతవరకు రాజకీయాల్లోనే ఉంటానని పవన్‌ కళ్యాణ్‌ స్పష్టం చేశారు. తాను సినిమాలు చేస్తూ రాజకీయాలు చేయడంపై విమర్శలు చేస్తుండడంపై మండి పడ్డారు. పూర్తిస్థాయి రాజకీయ నాయకుడంటూ ఎవ్వరూ ఉండరని ఆయన పేర్కొన్నారు. ఇతర పార్టీల్లో ఉన్న నాయకులందరూ వ్యాపారాలో, కాంట్రాక్టులో చేసుకుంటూ రాజకీయాలు చేస్తున్నారని, వారిలాగే తానూ సినిమాలు చేస్తూ రాజకీయాలు చేస్తే తప్పేంటని ప్రశ్నించారు. దేనికైనా సిద్దపడే తాను రాజకీయాల్లోని వచ్చానని, గెలిచినా, ఓడినా తనకు ఓకేనని అన్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఓడడాన్ని యుద్దంలో తగిలిన గాయాల్లా భావిస్తానే గానీ ఓటమిగా అనుకోనని అన్నారు. గత ఎన్నికల్లో తనకు ఓ పది ఎమ్మెల్యే స్థానాలు ఇచ్చినా ప్రజలకు ఫలితాలు వచ్చేలా పోరాటాలు చేసి విజయం సాధించే వాడినని అన్నారు. తాను ఎప్పుడూ ప్రజల కోసమే ఉంటానని, అయితే ప్రజలు తనను నమ్మి అధికారంలోకి తెస్తే వారికి మంచి భవిష్యత్తును అందిస్తానని పవన్‌ కళ్యాణ్‌ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement