Friday, April 26, 2024

నాలుగేళ్ల బుడ్డోడు.. మాములోడు కాదు

అమెరికాలోని బ్రూక్లిన్‌కు చెందిన నాలుగేళ్ల బాలుడు నోహ్ తన ఐపాడ్ పనిచేయడం లేదని తన తల్లి ల్యాప్‌టాప్ తీసుకున్నాడు. కానీ ల్యాప్‌టాప్‌లోని అమెజాన్ ప్రైమ్ అకౌంట్ ద్వారా 918 స్పాంజ్ బాబ్ పాప్సికల్స్‌ను బుక్ చేశాడు. వాటి ఖ‌రీదు 2వేల 618 డాల‌ర్లు. అంటే మ‌న క‌రెన్సీ ప్ర‌కారం రూ.1.91 ల‌క్ష‌లు. నోహ్ పెద్ద మొత్తంలో స్పాంజ్ బాబ్ పాప్సికల్స్‌ను బుక్ చేయడంతో డెలివరీ బాయ్ వాటిని పెద్ద పెద్ద బాక్సుల్లో తీసుకొచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న నోహ్ తల్లి నోరెళ్లబెట్టింది. నోహ్ తెలియక ఈ పని చేశాడని, ఆర్డర్ వెనక్కి తీసుకువెళ్లాలని డెలివరీ బాయ్‌ను కోరింది. అయితే ఆర్డర్ వెనక్కి తీసుకువెళ్లేందుకు డెలివరీ బాయ్ ఒప్పుకోలేదు.

దీంతో ఏం చేయాలో తెలియక నోహ్ తల్లి అయోమయంలో పడింది. అయితే ఆమె స్నేహితుడు ఓ ఐడియా వేశాడు. ‘గో ఫండ్ మీ’ అనే పేరుతో అకౌంట్ ఓపెన్ చేసి ‘పే ది బిల్’ అని ప్ర‌చారం చేశాడు. దీంతో వెల్లువ‌లా విరాళాలు వ‌చ్చాయి. దాదాపు 14వేల 971 డాల‌ర్లు అకౌంట్‌లో ప‌డ్డాయి. వాటితో అమెజాన్ డెలివరీ బాయ్‌కు బిల్లు చెల్లించిన బాలుడి త‌ల్లి.. మిగిలిన డ‌బ్బును నోహ్ చ‌దువుకు వాడ‌తాన‌ని తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement