Monday, April 15, 2024

కంటోన్మెంట్‌లో క్లోజ్ చేసిన 21 రోడ్లను ఓపెన్ చేయించండి.. కిష‌న్‌రెడ్డికి కేటీఆర్ ట్వీట్‌..

సికింద్రాబాద్ కంటోన్మోంట్ ఏరియాలో రూల్స్‌కి విరుద్ధంగా 21 రోడ్ల‌ను క్లోజ్ చేశారని మంత్రి కేటీఆర్ ట్వీట్‌చేశారు. ఆ రోడ్లకు సంబంధించిన వివ‌రాల‌ను కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డికి ట్విట్ట‌ర్‌లో షేర్ చేశారు. ల‌క్ష‌లాది మంది ఇబ్బందుల‌ను దృష్టిలో పెట్టుకుని మూసేసిన ఆ రోడ్ల‌ను తిరిగి ఓపెన్ చేయాల‌ని కోరారు.

కొంటోన్‌మెంట్ ప్రాంతంలో రోడ్ల‌ను క్లోజ్ చేయ‌డం వ‌ల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామ‌ని ఓ వాహ‌న‌దారుడు మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చాడు. ఈ ట్వీట్‌కు స్పందించిన మంత్రి కేటీఆర్ దాన్ని కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీనికి 21 ర‌హ‌దారుల జాబితా ఇవ్వాల‌ని కిష‌న్‌రెడ్డి కోర‌గా.. వాటిని ఇవ్వాల కేటీఆర్ ట్విట్ట‌ర్ ద్వారా షేర్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement