Monday, April 29, 2024

ఢిల్లీలో నిబంధ‌న‌లు ఉల్లంఘ‌న – జ‌రిమానాగా కోట్ల రూపాయ‌లు

కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తితో ప్ర‌పంచ‌దేశాలు అప్ర‌మ‌త్త‌మ‌య్యాయి. ఈనేపథ్యంలో ఇండియాలో కూడా కేసులు ఎక్కువ‌గానే న‌మోదు అవుతున్నాయి. ఈ మేర‌కు ఢిల్లీలో నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించిన వారి నుండి కోట్ల రూపాయ‌లు జ‌రిమానా రూపేనా వ‌సూలు అయ్యాయి. కాగా ఈ నెల 22,23తారీఖుల్లో జ‌రిమానాలు ఎక్కువ‌గా వ‌సూలు అయిన‌ట్టు అధికారులు తెలిపారు. కోవిడ్ నిబంధనలు పాటించని వారి నుంచి జరిమానా రూపంలో రూ.1.5 కోట్లు వసూలు చేశారు.

నిబంధనలు ఉల్లంఘించిన 7,778 మందిని పట్టుకున్నామని తెలిపారు. వీరంతా మాస్క్ ధరించకపోవడం, భౌతిక దూరం పాటించకపోవడం వంటి కోవిడ్ నిబంధనలను ఉల్లఘించారన్నారు. 163 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినట్టు చెప్పారు. ఉత్తర ఢిల్లీ, తూర్పు ఢిల్లీ ప్రాంతాలలో నిబంధనల ఉల్లంఘన ఎక్కువగా ఉంది. ఢిల్లీలోని 11 జిల్లాల్లో ఈస్ట్ ఢిల్లీ నుంచి 1245 మంది, ఉత్తర్ ఢిల్లీకి చెందిన 1446 మందిపై జరిమానాలు విధించారు. మరోవైపు ఢిల్లీలో కోవిడ్ కేసులతో పాటు ఒమిక్రాన్ కేసులు భారీగా పెరుగుతున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement