Friday, April 26, 2024

అక్రమ వెంచర్ పై కొరడా.. హద్దు రాళ్ల తొలగింపు

అక్రమ రియల్ ఎస్టేట్ వెంచర్ పై జిల్లా యంత్రాంగం కొరడా ఝుళిపించింది. ప్లాట్లలో వేసిన హద్దురాళ్లు తొలగించి,రోడ్లను ట్రాక్టర్ తో దున్నించి, ప్లాట్ల వద్ద నోటీసులు అతికించారు. అనుమతి లేదని తెలిపే ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తాన్ బాద్ మండలం చిన్న కల్వల గ్రామ పంచాయతీ పరిధిలో చిన్న బొంకూర్ వెళ్లే ప్రధాన రహదారి వెంబడి సర్వే నెంబర్ 47/2,48/3, 57/డిలోని రెండు ఎకరాల వ్యవసాయ భూమిలో ఎలాంటి అనుమతి లేకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారులు 37 ప్లాట్లను ఏర్పాటు చేసి అమ్మకాలు ప్రారంభించారు.

దీనిపై నిన్న పూర్తి ఆధారాలతో జిల్లా యంత్రాంగంనకు ఫిర్యాదులు వెళ్లాయి. వెంటనే స్పందించిన జిల్లా అధికారుల ఆదేశాల మేరకు స్థానిక పంచాయతీ కార్యదర్శి సతీష్ సిబ్బందితో కలసి అనుమతి లేని వెంచర్ లో వేసిన హద్దురాళ్లు తొలగించి,ట్రాక్టర్ తో రోడ్లను దున్నించారు. అక్కడ నోటీసులు అంటించి, ప్లాట్లకు అనుమతులు లేవని, ఎవరూ కొనుగోలు చేయరాదని తెలుపుతూ ఒక ఫ్లెక్సీ కూడా ఏర్పాటు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement