Tuesday, June 25, 2024

అధికారంలోకి వస్తే 5 రాజధానులు: సీమన్ సంచలన వ్యాఖ్యలు

తమిళనాడులో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అన్ని పార్టీలు హామీల వర్షం వర్షం కురిపిస్తున్నాయి. తాజాగా చెన్నైలో ఎన్టీకే అధినేత సీమన్ ఎన్నికల ప్రచారం సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఐదు రాజధానులను ఏర్పాటు చేస్తామని అన్నారు. చెన్నైతో పాటుగా కోయంబత్తూరు, కన్యాకుమారి, తిరుచ్చి, మధురైలను రాజధానులుగా ఏర్పాటు చేస్తామని తెలిపారు. తమిళనాడులో కొత్త రాజధానుల అంశం తెరమీదకు తీసుకురావడంతో సీమన్ ఒక్కసారిగా సంచలనంగా మారారు. కాగా, రాష్ట్రాల్లోని మొత్తం 234 స్థానాల్లో ఎవరితో పొత్తు పెట్టుకోకుండా సీమన్ ఒంటరిగా పోటీ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement