Saturday, May 4, 2024

స్పైస్ జెట్ విమానంపై సోనూసూద్ పోస్టర్

కరోనా లాక్‌డౌన్ సమయంలో నటుడు సోనూసూద్ చేసిన సేవల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వలసకూలీలు, ఆపన్నుల పాలిట ఆపద్బాంధవుడిలా నిలిచిన అతడికి తాజాగా అరుదైన గౌరవం దక్కింది. బడ్జెట్ ధరల విమానయాన సంస్థ స్పైస్ జెట్ తన విమానాలపై సోనూ సూద్ పోస్టర్‌ను అతికించింది. అంతేకాదు సోనూ సూద్‌ను ‘రక్షకుడు’గా అభివర్ణిస్తూ ఆయనకు శాల్యూట్ చేసింది. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ మేరకు హీరోయిన్ కాజల్ ట్విట్టర్ ద్వారా స్పందించింది. వావ్ అంటూ బిగ్ సెల్యూట్ చేసింది. భవిష్యత్‌లోనూ సోనూ సేవలు ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించింది

లాక్ డౌన్ సమయంలో వలసకూలీల వెతలపై తీవ్రంగా స్పందించిన సోనూ సూద్ వారి కోసం పెద్ద సంఖ్యలో బస్సులు ఏర్పాటు చేసి వారిని స్వస్థలాలకు తరలించారు. విదేశాల్లో చిక్కుకుపోయిన వారి కోసం విమానాలు పంపి స్వదేశానికి రప్పించారు. అడిగిన వారికి కాదనకుండా సాయం చేసి అపర కర్ణుడిగా మారాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement