Monday, May 20, 2024

క‌చ్చా బాద‌మ్ సింగ‌ర్ సెకండ్ సాంగ్ – స్టెప్స్ వేస్తోన్న నెటిజ‌న్స్

క‌చ్చా బాద‌మ్ అనే బెంగాలీ సాంగ్ తో అంత‌ర్జాతీయంగా గుర్తింపు పొందాడు భుబ‌న్ బ‌ద్యాక‌ర్. ఒకే ఒక్క సాంగ్ అత‌ని జీవితాన్నే మార్చేసింది. దాంతో ప‌ల్లీలు అమ్ముకునే వ్య‌క్తి .. ఓవ‌ర్ నైట్ స్టార్ అయిపోయాడు. ఆ త‌ర్వాత త‌న‌కు చాలా ఆఫ‌ర్స్ వ‌చ్చాయి. డ‌బ్బులు కూడా వచ్చాయి. దీంతో ఓ సెకండ్ హాండ్ కారు కొనుక్కున్నాడు భుబ‌న్. ఆ కారు డ్రైవింగ్ నేర్చుకుంటూ ఉండ‌గానే యాక్సిడెంట్ అయి త‌న చాతికి గాయాల‌య్యాయి. ఆసుప‌త్రిలో ట్రీట్‌మెంట్ తీసుకొని డిశ్చార్జ్ అవ్వ‌గానే కారు యాక్సిడెంట్ మీద‌నే భుబ‌న్ మ‌రో పాట పాడాడు. అమ‌ర్ నోటున్ గారి(నా కొత్త కారు) అంటూ భుబ‌న్ పాడిన పాట ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. క‌చ్చా బాద‌మ్ ఫీవ‌ర్ పోక‌ముందే మ‌రో పాట‌ను భుబ‌న్ పాడ‌టంతో నెటిజ‌న్లు ఖుషీ అవుతున్నారు. ఆ పాట‌కు కూడా స్టెప్స్ వేస్తూ సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement