Thursday, May 2, 2024

నీటిలోకి క్షిప‌ణుల‌ను ప్ర‌యోగించిన – ఉత్త‌ర‌కొరియా

తూర్పు తీరంలో బాలిస్టిక్ క్షిప‌ణుల‌ను నీటిలోకి ప్ర‌యోగించింది ఉత్త‌ర‌కొరియా. ఈ విష‌యాన్ని ద‌క్షిణ కొరియా సైన్యం వెల్ల‌డించింది. దక్షిణ కొరియా, అమెరికా మధ్య మొట్ట మొదటి ద్వైపాక్షిక సైనిక విన్యాసాలు ముగిసిన మర్నాడే ఉత్తర కొరియా అణు క్షిపణులను ప్రయోగించడం ద్వారా దక్షిణ కొరియాను పరోక్షంగా హెచ్చరించినట్టు అయింది. తూర్పు తీరంలో సముద్రం పైకి స్వల్ప దూరంలోని లక్ష్యాలను చేధించే ఎనిమిది బాలిస్టిక్ క్షిపణులను ప్యాంగ్ యాంగ్ లోని సునాన్ నుంచి ప్రయోగించినట్టు మా సైన్యం గుర్తించింద‌ని దక్షిణ కొరియా జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ప్రకటించారు. ఆదివారం 30 నిమిషాల వ్యవధిలో ఈ ప్రయోగాలు జరిగినట్టు చెప్పారు. మూడు చోట్ల నుంచి ఈ ప్రయోగాలు జరిగాయని చెబుతూ, ఇది ఆమోదనీయం కాదన్నారు. ఊహించనంత అధికంగా ఈ ఏడాది ఉత్తర కొరియా క్షిపణులను ప్రయోగిస్తున్నట్టు వెల్ల‌డించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement