Friday, April 26, 2024

మగాళ్లు తోడు లేకుండా మహిళలు జర్నీ చేయొద్దు.. ఆఫ్గాన్ ప్రభుత్వం కొత్త రూల్స్..

ఆఫ్గాన్ మహిళలు జర్నీ చేయడానికి కొత్త ఆంక్షలు తీసుకొచ్చింది తాలిబన్ ప్రభుత్వం. మహిళల వెంట మగాళ్లు తప్పకుండా ఉండాలని రూల్ పెట్టింది. మినిస్ట్రీ ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ విర్చ్యూ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ వైస్ అనే గైడ్ లైన్స్ జారీ చేసింది. అంతేకాకుండా మహిళలు తమ సాంప్రదాయం ప్రకారం.. ఇస్లామిక్ హిజాబ్స్ ని ధరించాలని, అట్లాంటి వారినే వాహనదారులు ప్రయాణానికి అనుమతి ఇవ్వాలని సూచించింది.

‘‘45మైళ్ల (72కిలోమీటర్లు) కంటే ఎక్కువ దూరం ప్రయాణించే స్త్రీలు తమ ఫ్యామిలీలోని మగాళ్లని కానీ, దగ్గరి బంధువులైన మగాళ్లని కానీ వెంట తీసుకురాకుంటే రైడ్ అంగీకరించవద్దు’’ అని మంత్రిత్వ శాఖ ప్రతినిధి సాడెక్ అకిఫ్ ముహాజిర్ మీడియాకు చెప్పారు. అది తప్పనిసరిగా దగ్గరి మగ బంధువు అయి ఉండాలన్నారు. మహిళా నటీనటులు నటించిన డ్రామాలు, వెబ్ సిరీస్ వంటి షోలను ప్రదర్శించడాన్ని కూడా నిలిపివేయాలని, టీవీలో వార్తలు చదివే వారు కూడా హిజాబ్స్ ధరించాలని మంత్రిత్వ శాఖ తెలిపింది. జర్నీ చేయాలనుకునే మహిళలకు కూడా హిజాబ్ అవసరమని ముహాజిర్ ఆదివారం మీడియాకు చెప్పారు. ప్రజలు తమ వాహనాల్లో పాటలు ప్లే చేయడాన్ని కూడా నిలిపివేయాలని మంత్రిత్వ శాఖ ఆదేశించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement