Sunday, May 19, 2024

హీరోయిన్ నిత్యామీన‌న్ – యూట్యూబ్ ఛాన‌ల్

ఈ మ‌ధ్య కాలంలో యూట్యూబ్ ఛానెళ్లు విప‌రీతంగా పెరిగిపోతున్నాయి. కాగా హీరోయిన్ నిత్యామీన‌న్ కూడా త‌నకంటూ సొంత యూట్యూబ్ ఛానెల్ ని ప్రారంభించింది. తెలుగు, త‌మిళ, మ‌లయాళ భాష‌ల్లో న‌టిస్తూ బిజీగా మారిపోయింది. ఈ బ్యూటీ ఇటీవ‌లే ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోగా న‌టించిన భీమ్లానాయ‌క్‌తో తెలుగు ప్రేక్ష‌కులను ప‌లుక‌రించింది. భీమ్లానాయ‌క్స‌తీమ‌ణిగా నిత్య‌మీన‌న్ పాత్ర‌కు మంచి మార్కులు ప‌డ్డాయి. నిత్య అన్ ఫిల్ట‌ర్డ్‌ (Nithya Unfiltered) పేరుతో యూట్యూబ్ ఛాన‌ల్ మొద‌లుపెట్టిన‌ట్టు త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ పెట్టింది నిత్య‌మీనన్‌. సినిమా ప్ర‌పంచంలో త‌న 12 ఏళ్ల ప్ర‌యాణానికి సంబంధించిన విష‌యాల‌ను తొలి వీడియోగా షేర్ చేసింది. త‌న వ్య‌క్తిగ‌త‌,వృత్తిప‌ర‌మైన జీవిత విశేషాల‌పై మ‌రిన్ని వీడియోలు త్వ‌ర‌లోనే మీ ముందుకు రాబోతున్నాయ‌ని తెలిపింది నిత్య‌మీన‌న్‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement