Sunday, April 28, 2024

నేడు అనంతపురం జిల్లాలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా పర్యటన

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేడు ఏపీలో పర్యటించనున్నారు. అనంతపూర్ జిల్లా లోని గోరంట్ల మండలం పాలసముద్రం వద్ద నాసిన్ అకాడమీకి నేడు నిర్మలా సీతారామన్‌ భూమి పూజ చేయనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఢిల్లీ నుంచి నిర్మల సీతారామన్ ఏపీకి బయలుదేరుతారు. మధ్యాహ్నం 2 గంటలకు అనంతపురం జిల్లాలో పర్యటిస్తారు. అనంతరం తిరిగి ఢిల్లీకి వెళ్లనున్నారు.

పాలసముద్రం సమీపంలో దేశంలో రెండో నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, పరోక్ష పన్నులు & నార్కోటిక్స్ (NACIN) రూ.730 కోట్లతో నిర్మించనున్నారు. దక్షిణాదిలో రెండో అతిపెద్ద శిక్షణ కేంద్రం ఇదే కావడం గమనార్హం. ఐఆర్‌ఎస్‌లకు (ఇండియన రెవెన్యూ సర్వీసెస్‌) ప్రొబెషనరీలో భాగంగా ఇక్కడ శిక్షణ నిర్వహించనున్నారు. పరోక్ష పన్నుల అంశంపై అభ్యర్థుల సామర్థ్యాన్ని పెంచేలా శిక్షణనివ్వనున్నారు. కాగా, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన హామీలో భాగంగా 2014లో అకాడమీ మంజూరు చేయబడింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement