Thursday, December 5, 2024

Breaking | విడాకులు​ తీసుకోబోతున్న నిహారిక.. కూకట్​పల్లి ఫ్యామిలీ కోర్టులో దరఖాస్తు

సినీ నటుడు నాగబాబు కుమార్తె నిహారిక కీలక నిర్ణయం తీసుకుంది. కొంతకాలంగా వివాహ బంధానికి దూరంగా ఉంటున్న ఆమె, తన భర్త జొన్నలగడ్డ చైతన్య నుంచి చట్టప్రకారం విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు కూకట్‌పల్లి ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. ఇద్దరూ పరస్పర అంగీకారంతో దరఖాస్తు చేసుకున్నారు. హిందూ వివాహచట్టం ప్రకారం విడాకులు కోరారు. దీనికి సంబంధించిన దరఖాస్తు ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

పెద్దలు నిశ్చయించిన ఈ పెళ్లి రాజస్థాన్‌లో హిందూ సాంప్రదాయ పద్దతుల్లో జరిగిందని, పిల్లలు లేరని దరఖాస్తులో ఉంది. కాగా, 2020లో చైతన్య జొన్నలగడ్డ – నిహారికల వివాహం జరిగింది. అయితే.. కారణాలు ఏమిటో తెలియదు కానీ, వీరిద్దరూ కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు. జొన్నలగడ్డ చైతన్య మాజీ ఐజీ జే ప్రభాకర్‌ రావు కుమారుడు అనే విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement