Friday, May 3, 2024

Breaking: ఏపీలో నైట్ కర్ఫ్యూ పొడిగింపు..

ఆంధ్రప్రదేశ్ లో నైట్ కర్ఫ్యూను ప్రభుత్వం పొడిగించింది. ఈనెల 14 వరకు నైట్ కర్ఫ్యూ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుందని పేర్కొంది. కరోనా థర్డ్ వేవ్ ముప్పును దృష్టిలో ఉంచుకుని జనవరి 18వ తేదీ నుంచి 31వ తేదీ వరకు నైట్ కర్ఫ్యూ అమలు చేస్తూ తొలుత ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.. కర్ఫ్యూని పొడిగిస్తూ మరోసారి ఆదేశాలిచ్చింది.

రాష్ట్రంలో ప్రజలందరూ మాస్క్‌లు ధరించటం తప్పనిసరి అని ప్రభుత్వం పేర్కొంది. దీనిని అతిక్రమించిన వారికి రు.100 జరిమానా విధిస్తారు. వివాహాలు, శుభకార్యాలు, మతపరమైన కార్యక్రమాలకు బహిరంగ ప్రదేశాల్లో అయితే గరిష్టంగా 200 మంది, ఇన్‌డోర్‌లో 100 మందికి మాత్రమే అనుమతి ఉంటుంది. ఈ కార్యక్రమాలకు హాజరయ్యే వారంతా కోవిడ్‌ నిబంధనలను విధిగా పాటించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement