Saturday, April 20, 2024

పేదింటి ఆడ‌బిడ్డ‌ల‌కు మేన‌మామ‌గా కేసీఆర్ : మంత్రి మ‌ల్లారెడ్డి

జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్, కిసార, ఘట్కేసర్ మండలాలకు తెలంగాణ ప్రభుత్వం తరపున మంజూరైన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను 97 మంది లబ్దిదారులకు మంత్రి మల్లారెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ… మన ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేదింటి ఆడబిడ్డలకు సొంత మేనమామ లాగా ఎంతో మంది పేద కుటుంబాలకు పెండ్లిల భారాన్ని తగ్గిస్తున్నారు. ఆడబిడ్డ వివాహానికి ఆర్థికంగా ఆదుకొని ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు.

ప్రతి పేదింటి ఆడబిడ్డకు పెళ్లికానుకగా రూ.1,00,116ల ఇస్తున్న ఏకైక ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వమ‌న్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ శరత్ చంద్ర రెడ్డి, మాజీ ఏమ్మెల్యే సుదీర్ రెడ్డి, మేయర్ కావ్య, డిప్యూటీ మేయర్ శ్రీనివాస్, జడ్పీ వైస్ చైర్మన్ వెంకటేష్, ఎంపీపీ ఇందిరా, మున్సిపల్ చైర్మన్లు ప్రణిత గౌడ్, చంద్రారెడ్డి, పావని యాదవ్, కొండల్ రెడ్డి, వైస్ చైర్మన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, కో అప్షన్ సభ్యులు, పార్టీ అధ్యక్షులు కొండల్, సుధాకర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement