Friday, April 26, 2024

శింబు ప్రేమ‌లో నిధిఅగ‌ర్వాల్ – పెళ్ళి వ‌ర‌కు వెళ్లేనా

ఇస్మార్ట్ శంక‌ర్ చిత్రంతో క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ నిధి అగ‌ర్వాల్. ఈ భామ ప్రేమ‌లో ప‌డింద‌ట‌. త‌మిళ స్టార్ హీరో శింబుతో ఆమె రిలేష‌న్ లో ఉంద‌న్న వార్త‌లు వినిపిస్తున్నాయి. అంతేకాదు త్వ‌ర‌లోనే వీరిద్ద‌రూ పెళ్ళి కూడా చేసుకోనున్నార‌ట‌. రీసెంట్ గా ఈశ్వరన్‌ సినిమాలో వీరిద్దరూ కలిసి నటించారు. గత ఏడాది జనవరి లో ఈ చిత్రం విడుదలైంది. ఈ సినిమా షూటింగ్‌ సమయంలోనే.. ఇద్దరూ ప్రేమలో పడ్డారని వార్తలు వస్తున్నాయి. మరోవైపు కొంత కాలంగా శింబు ఇంట్లోనే నిధి ఉంటోందనే ప్రచారం కూడా జరుగుతుంది. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకునేందుకు వీరు రెడీ అవుతున్నట్లు సమాచారం. మరి ఈ వార్తలు ఎంత వరకు నిజం అనేది తేలాలంటే వీరిద్దరిలో ఎవరో ఒకరు ప్ర‌క‌టించాల్సిందే. ఇప్ప‌టికే శింబు ఇద్దరు, ముగ్గురు హీరోయిన్లతో ప్రేమాయణం సాగించాడు.న‌య‌న‌తార‌, హ‌న్సికల‌తో ఎఫైర్ న‌డిపాడు. మ‌రి ఈసారైనా పెళ్ళి పీట‌లెక్కుతాడేమో చూద్దాం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement