Thursday, May 2, 2024

న్యూ గెట‌ప్ లో ‘ప‌వ‌న్ క‌ల్యాణ్’ లుక్

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ డిఫ‌రెంట్ గెట‌ప్ లో ఉన్న లుక్ సినిమా షూటింగ్ నుంచి లీక్ అయింది. ఆ లుక్ సోష‌ల్ మీడియాలో తెగ చ‌క్క‌ర్లు కొడుతోంది. తెల్ల పంచె, తెల్ల చొక్క..భుజం మీద నల్లటి గొంగళి, చేతిలో ముల్లు కర్ర, ఆముల్లు కర్రకు ఎర్ర తువ్వాలు.. కాలికి కడియం.. కిర్రు చెప్పులు వేసుకుని పవర్ స్టార్ కొత్త గెటప్ లో సరికొత్తగా కనిపించారు. ఏదో పాట షూటింగ్ కోసం ఈ అవతారం ఎత్తినట్టు సమాచారం. అయితే ఈ గెటప్ భీమ్లా నాయక్ సినిమాలోది అని తెలుస్తోంది. ఇందులో ఓ పాట కోసం పవన్ ఇలా మారాడట.పవర్ స్టార్ఏ ది చేసినా ఫ్యాన్స్ కు కొత్తగానే ఉంటుంది. ఆయన ప్రతీ గెటప్ ను ఫ్యాస్స్ ఎంజాయ్ చేస్తారు. ఇక ఇప్పుడు భీమ్లా నాయక్ సినిమాతో అదరగొట్టబోతున్నాడు పవర్ స్టార్(. మలయాళ మూవీ అయ్యప్పనుమ్ కోషియమ్ కు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాలో పవన్ తో పాటు రానా స్క్రీన్ ను షేర్ చేసుకున్నారు. ఈనెల 25న భీమ్లా నాయక్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కు రెడీ అవుతుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement