Tuesday, October 8, 2024

టెక్సాస్ కాల్పుల్లో నేరేడుచర్ల యువతి మృతి..

నేరేడుచర్ల, మే 8 (ప్రభ న్యూస్) : అమెరికాలోని టెక్సాస్ లో శనివారం ఉన్మాదులు జరిపిన కాల్పుల్లో నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని పాత నేరేడుచర్ల చెందిన తాటికొండ ఐశ్వర్య (27) మృతిచెందింది. ఐశ్వర్య తండ్రి తాటికొండ నర్సిరెడ్డి రంగారెడ్డి జిల్లా జడ్జిగా పనిచేస్తున్నారు. ఐశ్వర్య నేరేడుచర్ల మాజీ ఎంపీపీ, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ తాటకొండ రామ నర్సింహారెడ్డి మనవరాలు అమెరికాలోని పర్ఫెక్ట్ జనరల్ లో ప్రాజెక్టు మేనేజర్ గా పనిచేస్తున్న ఐశ్వర్య కాల్పుల్లో మృతి చెందడం పట్ల పాత నేరేడుచర్లలో విషాదఛాయలు నెలకొన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement