Saturday, May 18, 2024

నేడే ఎన్డీఎ కూట‌మి స‌మావేశం… పొత్తుల‌పై ప‌ద్మ వ్యూహం…

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఎన్డీఏని గద్దె దించడమే లక్ష్యంగా ఐక్యతా రాగం వినిపిస్తున్న ప్రతిప క్షాలకు ధీటు-గా బీజేపీ కూడా ఎత్తులు వేస్తోంది. వివిధ రాష్ట్రాల్లో చిన్న పార్టీలను సైతం కలుపు కుంటూ బీజేపీ నేతృత్వంలోని నేషనల్‌ డెమోక్ర టిక్‌ అలయన్స్‌ (ఎన్డీఏ) కూటమిని బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు సాగిస్తోం ది. ఈ క్రమం లో మంగళ వారం ఢిల్లీలో నిర్వహించనున్న ఎన్డీయే మిత్రపక్షాల సమా వేశం కీలకంగా మారింది. మొత్తం 38 రాజకీయ పార్టీలు ఈ భేటీ-లో పాల్గొంటాయని బీజేపీ జాతీయాధ్యక్షుడు జగత్‌ ప్రకాశ్‌ నడ్డా ప్రకటించారు. మంగళవారం సాయంత్రం గం.5.00కు అశోక హోటల్‌లో ఈ సమావె శాన్ని ఏర్పాటు- చేశారు. ఓబీసీలు, దళితులు, గిరిజన- ఆదివాసీల్లో పట్టు-న్న చిన్న పార్టీలను కలుపుకుంటూ బీజేపీ ముందుకు సాగుతోంది. ఒకప్పుడు కూటమిలో బీజేపీ తర్వాత పెద్ద దిక్కులా వ్యవహరించిన శిరోమణి అకాలీదళ్‌, తెలుగుదేశం వంటి పార్టీలకు ఆహ్వానం అందలేదు. లోక్‌ జనశక్తి (రాంవిలాస్‌) చిరాగ్‌ పాశ్వాన్‌, హిందుస్థాన్‌ ఆవామ్‌ మోర్చా అధినేత జితన్‌రామ్‌ మాంరీ&ు, రాష్ట్రీయ లోక్‌ సమతా పార్టీకి చెందిన ఉపేంద్ర కుశ్వాహా, వికాస్‌ శీల్‌ ఇన్సాన్‌ పార్టీకి చెందిన ముకేశ్‌ సహానీతో పాటు- శివసేన (ఏక్‌నాథ్‌ షిండే వర్గం), ఎన్సీపీ (అజిత్‌ పవార్‌ వర్గం), జనసేన, అన్నాడీఎంకే వంటి పార్టీలకు ఆహ్వానం అందింది.

ఎన్డీయేను బలోపేతం చేసే క్రమంలో కమలనాథులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. గతంలో వివిధ రాష్ట్రాల్లో బలమైన ప్రాంతీయ పార్టీలతో జట్టు-కట్టిన బీజేపీ, ఈసారి వ్యూహం మార్చినట్టు- స్పష్టమవుతోంది. 5శాతం కంటే తక్కువ ఓటు-బ్యాంకు కల్గిన చిన్న పార్టీలను కూడా బీజేపీ అక్కున చేర్చుకుంటోంది. తద్వారా ఎన్నికల్లో గెలుపోటములను నిర్ణయించే 1-2 శాతం ఓట్ల వ్యత్యాసాన్ని భర్తీ చేసుకోవచ్చని భావిస్తోంది. ఈ క్రమంలో పెద్ద రాష్ట్రం ఉత్తర్‌ ప్రదేశ్‌లో అప్నాదళ్‌ ఇప్పటికే ఎన్డీయే కూటమిలో ఉండ గా.. ఇప్పుడు తాజాగా ఓబీసీ నేత రాజ్‌భర్‌ను తమ శిబిరంలోకి చేర్చు కుంది. ఇప్పటి వరకు సమాజ్‌వాదీ పార్టీతో జట్టు-కట్టిన సుహేల్‌దేవ్‌ భారతీయ సమాజ్‌ పార్టీ అధినేత ఓంప్రకాశ్‌ రాజ్‌భ ర్‌ను ఆకట్టు-కోవడం ద్వారా ఓబీసీ వర్గాల్లో కొత్త ఓటు-బ్యాం కును జమచేసుకున్నట్టయింది.


దేశ జనాభాలో సగం కంటే ఎక్కువ గా ఉన్న ఓబీసీల్లో పట్టు- సాధించడం ద్వారా బలాన్ని పెంచుకునే వ్యూహం తో ముందుకెళ్తున్న బీజేపీ, ఆ దిశలోనే ఆయా వర్గాల్లో పట్టు న్న పార్టీలపై కన్నేసింది. ప్రాంతీ యం గా బలంగా ఉన్న పెద్ద పార్టీలతో పెట్టు-కుంటే సీట్ల సర్దుబాటు-లో సింహ భాగం ఆ పార్టీలకే ఇవ్వాల్సి వస్తోంది. పైగా బీజేపీ బలాన్ని ఆ పార్టీలు ఉపయోగించుకుని రాష్ట్రాల్లో అధికా రాన్ని సాధిస్తూ, తమ ను సొంతంగా ఎదగ కుండా అడ్డుకుం టు-న్నాయన్న భావన కూడా కమల నాథుల్లో ఉంది. సుదీర్ఘకాలంగా పంజాబ్‌లో అకాలీద ళ్‌, ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీలతో చేసిన చెలిమి ఉభయ కుశలోపరిగా మిగల్లేదని గ్రహించింది. మహారాష్ట్రలో శివసే న (చీలికకు ముందు) నుంచి దూరమ య్యాక, బీహార్‌లో జేడీ(యూ)తో తెగదెం పులు చేసుకున్న తర్వాతనే బీజేపీ తన సొంత బలాన్ని పెంచుకోగలిగందనే విశ్లేషణ కూడా ఉంది. అదే చిన్న పార్టీల తో జట్టు-కడితే సీట్ల సర్దుబాటు-లోనూ సమస్య ఉండద ని, పైగా ఇరువురికీ ప్రయోజన కారిగా పొత్తుల ఫలితాలు ఉంటాయని అంచ నా వేస్తోంది. బీహార్‌లో పాత కొత్త మిత్రపక్షం లోక్‌జ నశక్తి(రాం విలాస్‌)ని ఎన్డీయే గూటిలోకి

తీసుకొచ్చింది. రాంవిలాస్‌ పాశ్వాన్‌ బ్రతికున్నప్పుడు ఎన్డీయే ప్రభుత్వంలో భాగంగా ఉన్న విషయం తెలిసిందే. ఆయన మరణం తర్వాత పార్టీలో చీలిక ఏర్పడగా, పశుపతి కుమార్‌ పరాస్‌ నేతృత్వం లోని లోక్‌ జనశక్తి ఎన్డీయేలో కొనసాగగా, చిరాగ్‌ పాశ్వా న్‌ దూరమ య్యారు. దళిత, బహు జన వర్గాల్లో గట్టి పట్టు-న్న లోక్‌ జన శక్తిని ఏకతాటిపైకి తీసుకురావడం ద్వారా ఆయా వర్గాల ఓట్లు- చీల కుండా చూడా లని బీజేపీ చూస్తోం ది. మొత్తం గా అమి త్‌ షా మంత్రాంగం ఫలించి చిరాగ్‌ ఎన్డీయే గూటికి దగ్గర య్యారు. మం గళవారం నాటి ఎన్డీయే మిత్ర పక్షాల స మా వేశానికి హాజర య్య ముందు సోమ వారం అమిత్‌ షాతో కూడా విడిగా భేటీ- అయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement