Friday, April 26, 2024

రాచ‌రికాన్ని వీడి సామాన్యురాలిలా మారిన మ‌కో కొమురో..ఎందుకో తెలుసా..

యువ‌రాణి హోదా అంటే మాట‌లా చెప్పండి. కానీ ప్రేమ‌,పెళ్లికోసం ఆ హోదాతో పాటు రాచ‌రికాన్ని వ‌దులుకుంది జ‌పాన్ మాజీ రాకుమారి మ‌కో కొమురో. దాంతో స్వ‌దేశానికి గుడ్ బై చెప్పేసింది. కాలేజ్ లో తన క్లాస్‌మేట్ అయిన కీ కొమురోను ప్రేమించి పెళ్లాడింది. భర్త కీతో కలిసి అమెరికా వెళ్లిపోయారామె. జపాన్ చక్రవర్తి నరుహిటో మేనకోడలైన మాకో గత నెలలో తన కాలేజీ మేట్ అయిన కీ కొమురోను వివాహం చేసుకున్నారు. ఈ వివాహానికి రాజ కుటుంబం అనుమతి లేకపోవడంతో టోక్యోలో అత్యంత నిరాడంబరంగా జరిగింది. ప్రేమ కోసం అన్నింటినీ వదులుకుని సామాన్యురాలిగా మారిన మాకో ఇప్పుడు కొత్త జీవితాన్ని వెతుక్కుంటూ అమెరికా వెళ్లిపోయారు. కీని పెళ్లి చేసుకోవడం ద్వారా తన రాచరికపు హోదా పోతుందని తెలిసినా మాకో లెక్క చేయలేదు. రాచరికాన్ని వదులుకోవడం ద్వారా రావాల్సిన కోట్లాది రూపాయలను కూడా తృణప్రాయంగా వదులుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement