Thursday, April 25, 2024

నందమూరి రామకృష్ణకు తృటిలో తప్పిన ప్రమాదం..!

రోడ్డుప్ర‌మాదంలో నంద‌మూరి రామ‌కృష్ణ‌కు స్వ‌ల్ప‌గాయాల‌య్యాయి. ఈరోజు ఉద‌యం జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెంబర్-10 లో వెళ్తుండగా యాక్సిడెంట్‌ జరిగింది. ఈ ప్రమాదంలో రామకృష్ణకు స్వల్పగాయాలయ్యాయి. కానీ కారు మాత్రం పూర్తిగా నుజ్జు నుజ్జు అయింది. చికిత్స అనంతరం ప్రస్తుతం రామకృష్ణ ఆరోగ్యంగానే ఉన్నారు. అయితే ఈ విషయంపై నందమూరి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. వరుసగా నందమూరి కుటుంబలో విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇక గతంలో కూడా నందమూరి హరికృష్ణ, నందమూరి జానకీరామ్‌లు కారు యాక్సిడెంట్స్‌లోనే కన్ను మూయడం, ఎన్టీఆర్ కి కూడా యాక్సిడెంట్ అవ్వడం.. ఇప్పుడు నందమూరి రామకృష్ణ కార్ యాక్సిడెంట్ అవ్వడం.. అలాగే ఇటీవలే నందమూరి తారకరత్న పాదయాత్రలో గుండెపోటుతో పడిపోయి చికిత్స తీసుకుంటున్నారు. ఆయన ఇంకా కోలుకోకముందే నందమూరి కుటుంబంలో మరో ప్రమాదం నెలకొంది. ఇవన్నీ చూసి అభిమానులు కంగారు పడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement