Sunday, May 5, 2024

నా భార్యకు పురుషాంగం ఉంది.. కాపురం చేయలేను, మీరే కాపాడాలే.. సుప్రీం తలుపుతట్టిన భర్త

సుప్రీంకోర్టు ముందుకు ఓ విచిత్రమైన కేసు వచ్చింది. తన భార్యకు పురుషాంగం ఉంది.. తనను మోసం చేసి పెళ్లి చేసుకుందని ఓ వ్యక్తి సుప్రీం కోర్టును ఆశ్రయించాడు.  అయితే.. ధర్మాసనం ఈ పిటిషన్​ స్వీకరించేందుకు తొలుత నిరాకరించినా.. వైద్య పరీక్షల రిపోర్టులన్నీ పరిశీలించాక ఆమెతో పాటుతల్లిదండ్రులకు నోటీసులు పంపింది..

మధ్య ప్రదేశ్​కు చెందిన ఓ వ్యక్తి 2016లో పెళ్లి చేసుకున్నాడు.. ఆ తర్వాత ఘట్టానికి అమ్మాయి సహకరించలేదు. ఇలా కొద్ది రోజులుగా వాయిదా పడుతూనే వస్తోంది. అయినా అతను చాలా ఓపికిగా ఉన్నాడు. అనుకోకుండా ఓ రోజు తన భార్యకు పురుషాంగం ఉండడం గమనించాడు. దీంతో తను మోసపోయానని, అమ్మాయిని కాకుండా అబ్బాయిని తనకు కట్టబెట్టారని లొల్లి చేశాడు. ఆ తర్వాత ఆమెను డాక్టర్ల దగ్గరికి తీసుకెళ్తే ‘‘అవును.. ఇది వాస్తవమే.. కానీ,  అమ్మాయికి కొన్ని హార్మోన్ల లోపం వల్ల ఇట్లా జరిగింది. సర్జరీ చేయాల్సి ఉంటుంది’’ అని వైద్యులు చెప్పారు.  , ఇది ఆమెకు పుట్టుకతో వచ్చిన అడ్రినల్ హైపర్‌ప్లాసియా అనే జన్యుపరమైన రుగ్మతగా వెల్లడించారు.

భార్య యొక్క వైద్య నివేదికలో ఆమె జీవశాస్త్రపరంగా స్త్రీ అని, అండాశయాలతో స్త్రీగానే గుర్తించినట్టు డాక్టర్లు చెప్పారు. అయితే.. బాహ్యంగా మాత్రం పురుషాంగం కలిగి ఉండడమే ఆందోళనకు కారణమయ్యింది. తన భార్య, మామగారు మోసం చేశారని ఆరోపిస్తూ గ్వాలియర్‌కు చెందిన ఆ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ కేసును విచారించేందుకు అత్యున్నత న్యాయస్థానం తొలుత విముఖత వ్యక్తం చేసినప్పటికీ, వైద్య నివేదికను పరిశీలించిన తర్వాత మహిళకు నోటీసులు జారీ చేసింది.

ఆ వ్యక్తి తన భార్యను ఆమె తల్లిదండ్రుల వద్దకు తిరిగి పంపించి, తాను మోసపోయానని పేర్కొన్నాడు. ఈ క్రమంలో అతనిపై మహిళ కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసి.. తమ కూతురును హింసిస్తున్నడని కేసు పెట్టింది. దీంతో రెండు కుటుంబాల మధ్య అనేక గొడవలు జరిగాయి. ఆ వ్యక్తి కూడా ఆ కుటుంబంపై చీటింగ్ కేసు నమోదు చేశాడు. కాగా, భార్య వైద్య చరిత్ర పెళ్లికి మూడేళ్ల క్రితమే నిర్ధారణ అయిందని, వైద్య పరిస్థితిని సరిదిద్దేందుకు హార్మోన్ల చికిత్స కూడా తీసుకుంటున్నట్లు స్థానిక ఆసుపత్రి వైద్యులు వాంగ్మూలం ఇచ్చినట్టు అతను రిపోర్టు కూడా సబ్మిట్​ చేశాడు. ట్రయల్ కోర్టు ముందు డాక్టర్ కూడా ఆమెకు ఆ అవయవాలు ఉన్నందున ఆమె పిల్లలను కనడం అసాధ్యం అని చెప్పారు. లోయర్ కోర్టులో విచారణ కొనసాగుతున్న సమయంలో ట్రయల్ కోర్టు మహిళకు నోటీసు జారీ చేసింది. కేసును పరిగణలోకి తీసుకున్న ట్రయల్ కోర్టు ఆదేశాలను వ్యతిరేకిస్తూ ఆమె మధ్యప్రదేశ్ హైకోర్టును కూడా ఆశ్రయించారు.

అయితే.. వైద్య నివేదికల ప్రకారం ఆమెకు స్త్రీ లక్షణాలు, అవయవాలు ఉన్నాయని.. అందువల్ల మోసం చేసిన నేరం సరైంది కాదని పేర్కొంటూ మధ్యప్రదేశ్ హైకోర్టు అతని అభియోగాలను కొట్టివేసింది. దీంతో అతను సుప్రీం కోర్టు తలుపులు తట్టాడు. పెళ్లి ఖర్చులన్నీ తానే భరించానని, దానికి భార్య కుటుంబం ఆర్థికంగా సహకరించలేదని కూడా పేర్కొన్నాడు. న్యాయమూర్తులు ఎస్‌కె కౌల్‌, ఎంఎం సుందరేష్‌లతో కూడిన ధర్మాసనం ముందు జరిగిన క్లుప్త విచారణ సందర్భంగా అప్పీలుదారు తరఫు సీనియర్ న్యాయవాది ఎన్‌కె మోడి వాదనలు వినిపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement