Tuesday, April 30, 2024

మ్యూజిక్ మ్యాస్ట్రో.. ఏఆర్. రెహ‌మన్‌కు అరుదైన గౌర‌వం..

43వ కైరో ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్ (సీఐఎఫ్‌ఎఫ్‌) వేదికపై సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమన్‌కి అరుదైన గౌరవం దక్కింది. ఈ విషయాన్ని రెహ‌మ‌న్ త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో షేర్‌చేసుకున్నారు. సంగీత రంగంలో తాను చేసిన కృషికి గాను సీఐఎఫ్‌ఎఫ్‌ వేదికగా ప్రశంసలు కురిపించారని పేర్కొన్నారు. తెలుగు, తమిళ, మలయాళ, బాలీవుడ్‌ రంగాలతో పాటు హాలీవుడ్‌ వంటి విభిన్న చలనచిత్ర పరిశ్రమలలో అందించిన సంగీతంతో రెహమన్‌ ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందారు. ఫెస్టివల్‌లో దిగిన ఫొటోతో పాటు సినిమా, సీఐఎఫ్‌ఎఫ్‌ ఇచ్చిన ప్రశంసా పత్రాన్ని పోస్ట్‌ చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసంఫేస్‌బుక్‌,  ట్విట్టర్   పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement