Sunday, April 28, 2024

మురుగ మఠాధిపతి శివమూర్తికి ఛాతినొప్పి

మురుగ మఠాధిపతి శివమూర్తికి ఛాతినొప్పి వచ్చింది. దీంతో భారీ బందోబస్తు మధ్య ఆయనను చిత్రదుర్గ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం శివమూర్తిని పోలీసులు జైలుకు తరలించనున్నారు. బాలికలను లైంగికంగా వేధించినట్లు శివమూర్తిపై అభియోగాలున్నాయి. ఈ కేసులో శివమూర్తికి 14రోజుల జ్యుడీషియల్ కస్టడీని న్యాయమూర్తి విధించారు.

గత నెల 26న చిత్రదుర్గలోని మురఘశ్రీ హాస్టల్‌లో చదువుకుంటున్న ఇద్దరు మైనర్‌ విద్యార్థినులు శివమూర్తి స్వామీజీపై లైంగిక వేధింపుల ఫిర్యాదు చేయడంతో మైసూరు నజరాబాద్‌ పోలీసులు పోక్సో, ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. 

Advertisement

తాజా వార్తలు

Advertisement