Friday, February 3, 2023

బుక్స్ లో డాల‌ర్స్.. పేస్ట్ లో బంగారం

పుస్త‌కాల్లో డాల‌ర్ల నోట్ల‌ను ప‌ట్టుకువ‌స్తున్న వ్య‌క్తుల‌ను గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు.ఆ ప్ర‌యాణికుల నుంచి 2.5 కేజీల బంగారాన్ని కూడా సీజ్ చేశారు. పేస్ట్ రూపంలో వాళ్లు ఆ బంగారాన్ని తీసుకువ‌చ్చారు. ముంబై ఎయిర్‌పోర్టు క‌స్ట‌మ్స్ అధికారులు అమెరికా నుంచి వ‌చ్చిన ఇద్ద‌రు ప్యాసింజెర్ల‌ను ప‌ట్టుకున్నారు. వారి వ‌ద్ద నుంచి 90వేల అమెరికా డాల‌ర్ల‌ను సీజ్ చేశారు. అమెరికా డాల‌ర్ల నోట్ల‌ను పుస్త‌కాల్లో తీసుకువ‌స్తున్న ఆ ఇద్ద‌ర్ని అదుపులోకి తీసుకున్నారు. రెండు వేర్వేరు కేసుల్లో ఆ ఇద్ద‌ర్నీ అదుపులోకి తీసుకున్నారు. ఆ ప్రయాణికులు ఇద్ద‌రూ విదేశీయులే. పుస్త‌కాల్లో డాలర్ల నోట్ల‌ను ప‌ట్టుకువ‌స్తున్న‌ట్లు అధికారులు గుర్తించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement