Thursday, April 25, 2024

ములాయంకు చిన్న కోడలు షాక్‌.. కమలం గూటికి అపర్ణ యాదవ్‌!

లక్నో : ఉత్తర్‌ప్రదేశ్‌లో అసెంబ్లిd ఎన్నికల రాజకీయం రసవత్తరంగా మారింది. ఎన్నికల తేదీ సమీపిస్తున్న కొద్దీ జంపింగ్‌ నేతల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటికే బీజేపీకి చెందిన కీలక మంత్రులు, ఎమ్మెల్యేలు సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. అయితే బీజేపీ కూడా తన వ్యూహాలకు పదును పెట్టింది. ఏకంగా సమాజ్‌వాదీ పార్టీకి దిమ్మదిరిగే షాక్‌ ఇచ్చింది. సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్‌ యాదవ్‌ చిన్న కోడలు అపర్ణ యాదవ్‌ బీజేపీలో చేరేందుకు సిద్ధం అవుతున్నారు. కీలక నేతలు బీజేపీని వీడి ఎస్‌పీలో చేరిన నేపథ్యంలో.. అపర్ణ చేరిక, కాషాయ పార్టీకి కొంత బలాన్ని చేకూరుస్తుంది. బీజేపీలో చేరికపై ఆ పార్టీ అధిష్టానం కొన్ని రోజులుగా అపర్ణ యాదవ్‌తో టచ్‌లు ఉన్నట్టు తెలుస్తోంది.

అసెంబ్లి ఎన్నికల్లో అపర్ణ యాదవ్‌కు టికెట్‌ ఇచ్చేందుకు ఆ పార్టీ అధిష్టానం అంగీకరించడంతో కాషాయ కండువా కప్పుకునేందుకు ఆమె సిద్ధమైనట్టు ప్రచారం జరుగుతున్నది. అపర్ణ యాదవ్‌, ములాయం సింగ్‌ చిన్న కుమారుడు ప్రతీక్‌ యాదవ్‌ సతీమణి. 2017 అసెంబ్లిd ఎన్నికల్లో ఎస్‌పీ టికెట్‌పై అలహాబాద్‌ నుంచి పోటీ చేశారు. కానీ బీజేపీ అభ్యర్థి రీతా బహుగుణ జోషి చేతిలో 33,796 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అపర్ణ యాదవ్‌ ఎస్‌పీలో కొనసాగుతున్నప్పటికీ.. పలు సందర్భాల్లో పార్టీ లైన్‌కు విరుద్ధంగా బీజేపీకి మద్దతు ఇచ్చారు. ఎన్‌ఆర్‌సీ విషయంలో బీజేపీకి మద్దతు ప్రకటించారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం తనవంతుగా రూ.11లక్షలు అందజేశారు. ఈ నేపథ్యంలో అఖిలేష్‌ యాదవ్‌.. రంగంలోకి దిగి అపర్ణతో మాట్లాడే అవకాశాలు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement