Sunday, May 5, 2024

మెగాస్టార్ చిరంజీవి చిత్రంలో – జ‌ర్న‌లిస్టుగా స్టార్ డైరెక్ట‌ర్

మెగాస్టార్ చిరంజీవి సినిమాలో యాక్ట్ చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు ద‌ర్శ‌కుడు పూరీ జ‌గన్నాథ్.. మోహన్ రాజా దర్శకత్వంలో ‘గాడ్ ఫాదర్’ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో జర్నలిస్టు పాత్రలో పూరిజ‌గ‌న్నాథ్ కనిపించనున్నాడని స‌మాచారం. రాజకీయాలకి సంబంధించిన నేపథ్యంలో నిర్మితమవుతున్న ఈ సినిమాలో నయనతార ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. అలాగే ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రను సల్మాన్ పోషించాడు. ఇటీవలే బాంబే షెడ్యూల్ పూర్తయింది. మలయాళ ‘లూసిఫర్’కి రీమేక్ గా రూపొందుతున్న ఈ సినిమా, ఆ స్థాయిలోనే ఇక్కడ కూడా హిట్ కొడుతుందని భావిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement