Saturday, May 4, 2024

ఏపీ-తెలంగాణ సరిహద్దులో మళ్లీ గందరగోళం.. “ఈ పాస్” ఉంటేనే ఎంట్రీ.. భారీగా ట్రాఫిక్

ఏపీ నుంచి వస్తున్న అంబులెన్స్‌లను తెలంగాణ సరిహద్దుల్లో మళ్లీ అడ్డుకుంటున్నారు. అనుమతి లేదని చెప్పి పోలీసులు నిలిపివేస్తున్నారు. అనుమతి లేనిదే తెలంగాణలోకి అనుమతించబోమని స్పష్టం చేశారు. దీంతో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల నేపధ్యంలో పోలీసులు ఆంక్షలు కఠినంగా అమలు చేస్తున్నారు. “ఈ పాస్” ఉంటేనే తెలంగాణలోకి వాహనాలకు అనుమతిస్తున్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో ఏపీ నుండి వచ్చే వాహనాలను తిరిగి వెనక్కి పంపిస్తున్నారు. అనుమతి లేని అంబులెన్స్ లను కూడా అడ్డుకుంటున్నారు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పోలీసుల చర్యలతో ఏపీ- తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లో వద్ద వాహనాలు భారీగా నిలిచిపోయాయి.

మరోవైపు కరోనా ఉద్ధృతి నేపథ్యంలో ఇతర రాష్ట్రాల నుంచి కరోనా రోగులు చికిత్స కోసం పెద్ద ఎత్తున హైదరాబాద్‌కు వస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ లోని చాలా ఆస్పత్రుల్లో బెడ్స్ నిండిపోయాయి. బెడ్ల కోరతతో చాలా మంది ఇతర ప్రాంతాల నుంచి నగరానికి వచ్చి ఇబ్బందులు పడుతున్నారు. దీంతో హైదరాబాద్‌లోని ఆస్పత్రుల్లో బెడ్ కన్ఫామ్ అయినట్లు పత్రాలు చూపిస్తేనే తెలంగాణలోని అనుమతిస్తున్నారు పోలీసులు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌కు చికిత్స కోసం వచ్చే వారికోసం ప్రత్యేక మార్గదర్శకాలను రూపొందించారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే రోగులు రెండు రకాల అనుమతులు తప్పనిసరి. తెలంగాణలో చికిత్స నిమిత్తం వచ్చే అంబులెన్స్‌లు, వ్యక్తిగత వాహనాలు, ప్రైవేట్ వాహనాలలో వచ్చే కోవిడ్ రోగులకు సంబంధిత ఆసుపత్రుల నుంచి జారీ చేసిన లెటర్స్‌తో పాటు హైదరాబాద్‌లోని వైద్య ఆరోగ్య, ప్రజారోగ్య కోవిడ్ కంట్రోల్ రూమ్ నుండి జారీ చేసిన పాస్ విధిగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. 

ఇది కూడా చదవండి : సుప్రీం కోర్టు విచారణలు ప్రత్యక్ష ప్రసారానికి సిద్ధం.. చీఫ్ జస్టిస్ రమణ

Advertisement

తాజా వార్తలు

Advertisement