Thursday, April 25, 2024

‘వన్ ఎర్త్ – వన్ హెల్త్’ విధానాన్ని అమలు చేయాలి: ప్రధాని మోదీ

కరోనా వైరస్ ను ఎదుర్కోవటానికి ‘వన్ ఎర్త్ – వన్ హెల్త్’ విధానాన్ని అమలు చేయాలని ప్రధాని నరెంద్ర మోడీ పిలుపునిచ్చారు. జీ7 దేశాల సదస్సులో ఆయన తొలిసారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. కరోనా సెకండ్ వేవ్ తో అల్లాడిపోయిన భారత్ కు అండగా ఉన్న జీ7 దేశాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మహమ్మారిని ఎదుర్కోవటానికి ప్రపంచ దేశాలు ఐక్యత ముందుకు సాగాలని తెలిపారు. అంతర్జాతీయ ఆరోగ్య విధానానికి ప్రపంచమంతా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని, దానికి తానూ కట్టుబడి ఉన్నానని చెప్పారు.

కరోనా మహమ్మారితో జనవరి నుంచి మే వరుకు దాదాపు రెండు లక్షల మంది మృతి చెందారని తెలిపారు. బ్రిటన్, కెనడా సహా అనేక దేశాలు భారత్ కు సహకారం అందించాయని తెలిపారు. కరోనా విజృంభణ సమయంలో ఆక్సిజన్, వెంటిలేటర్లు, కాన్సన్ ట్రేటర్లు వంటి వనరుల కొరత ఎదుర్కొన్న భారత్ కు సాయం చేశాయని తెలిపారు. మహమ్మారిని సమర్థంగా ఎదుర్కొనేందుకు భారత్ లో ప్రభుత్వం, పరిశ్రమ రంగం, పౌర సమాజం కలిసికట్టుగా పోరాడుతున్న విధానాన్ని ప్రధాని వివరించారు. భవిష్యత్ మహమ్మారులను నివారించడానికి ప్రపంచ ఐక్యత, నాయకత్వం, సహకారం కావాలని మోదీ జీ-7 వేదికగా పిలుపునిచ్చారు.

కరోనా కేసుల గుర్తింపులో కాంటాక్ట్ ట్రేసింగ్ కోసం, వ్యాక్సినేషన్ కోసం వాడిన ఓపెన్ సోర్స్ టూల్స్ చాలా విజయవంతమయ్యాయని, అభివృద్ధి చెందుతున్న దేశాలకు తమ అనుభవాలను పంచుకుంటామని చెప్పారు. మేధో సంపత్తి హక్కులపై వాణిజ్య సంబంధిత విషయాలపై భారత్ కు జీ7 మద్దతునివ్వాలని ప్రధాని మోదీ కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement