Monday, May 6, 2024

Kavitha: తెలంగాణ యువతకు ‘ఉద్యోగ నామ’ సంవత్సరం

తెలంగాణ ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. శుభకృత్ నామ సంవత్సరంలో ప్రజలందరి జీవితాల్లో శుభాలను తీసుకురావాలని, మనందరం బాగుండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు. ఉగాది పండుగ సందర్భంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రత్యేక సందేశం ఇచ్చారు. ”ఉగాది పర్వదినాన శతాయు వజ్రదేహాయ సర్వ సంపత్ కారాయచ.. సర్వార్రిష్ట వినాశాయ.. నింబకం దళ భక్షణమ్‌॥ అంటూ పచ్చడి తాగుతాం. ఉగాది పచ్చడిలో ఉండే తీపి, చేదు, పులుపు, ఒగరు, కారం, ఉప్పు రుచులు ఉన్నట్టుగానే, జీవితంలోనూ కష్ట నష్టాలు, సుఖ దుఃఖాలు, అనేక కఠిన పరిస్థితులను ఎదుర్కోవాల్సిన సందర్భాలు వస్తుంటాయి. అన్ని పరిస్థితుల్లోనూ దేవుడు మీతో ఉండాలని, ప్రజలంతా ధైర్యంగా జీవితంలో ముందడుగు వేయాలని కోరుకుంటున్నా” అని కవిత పేర్కొన్నారు.  

తెలుగు వారంతా ఈ సంవత్సరాన్ని శుభకృత్ నామ సంవత్సరంగా జరుపుకుంటే, తెలంగాణ యువత ఉద్యోగ నామ సంవత్సరంగా చేసుకుంటున్నారని భావిస్తున్నానని వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్ 90 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తుండటంతో యువత ప్రిపరేషన్ లో బిజీగా ఉన్నారని చెప్పారు. పరీక్షలకు సిద్దమయ్యే యువత టీ- సాట్ ద్వారా టీవిల్లో, యూ ట్యూబ్ లో ఉచితంగా అందుబాటులో ఉండే ఎగ్జామ్స్ ప్రిపరేషన్ మెటీరియల్ ను ఉపయోగించుకుని, ప్రభుత్వ ఉద్యోగాలు సాధించేలా పిల్లలను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement