Thursday, April 25, 2024

ఎమ్మెల్సీ క‌ల్వకుంట్ల క‌విత‌కి.. రామోజీరావు లేఖ‌.. ఏం రాశారంటే ..

ఎమ్మెల్సీ ఎన్నిక‌లో వ‌రుస‌గా రెండోసారి గెలిచిన క‌ల్వ‌కుంట్ల క‌విత‌కి ఈనాడు సంస్థ‌ల అధినేత చెరుకూరి రామోజీరావు లేఖ రాశారు. ఈ సంద‌ర్భంగా ఆమెకు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. మ‌రి ఆయ‌న రాసిన లేఖ‌లో ఏముందంటే..నిజామాబాద్ జిల్లా స్థానిక ప్రజా ప్ర‌తినిధుల నియోజ‌క‌వ‌ర్గం నుంచి శాస‌న‌మండ‌లికి ఏక గ్రీవంగా ఎన్నికైన మీకు నా హృద‌య‌పూర్వ‌క శుభాకాంక్ష‌ల‌ని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయ పరంపర కొనసాగించి ప్రాబల్యం చాటుకున్న మీరు శాసనమండలిలో ప్రజావాణిని మరింత గట్టిగా వినిపించి జననాయకురాలిగా ఇనుమడించిన కీర్తి గడిస్తారని విశ్వసిస్తున్నాను. ప్రజాసేవలో మరెన్నో విజయాలు సాధించి అందరి మన్ననలందుకుంటారని భావిస్తున్నాన‌ని లేఖ‌లో రాశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement