Sunday, April 28, 2024

అర గంటకే రూ.500 పార్కింగ్ ఫీజు.. కేటీఆర్ ఏమన్నారంటే..

బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో పార్కింగ్ ఫీజు ఎంత ఉంటుంది? మహా అయితే, గంటకు రూ.10 ఉంటుంది. కానీ ఓ వ్యక్తి తన కారును రైల్వే స్టేషన్ లో కేవలం అర గంటల పార్క్ చేసినందుకు ఏకంగా రూ.500 ఫీజ్ వసూలు చేశారు. రైల్వే స్టేషన్లు కూడా ప్రైవేటీకరణ చేశారా? అంటూ బాధితుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. పార్కింగ్ ఫీజ్ కు సంబంధించిన టికెట్ ను సోషల్ మీడియాలో ట్వీట్ చేశాడు. దీనిపై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. కేంద్ర రైల్వే మంత్రిని ట్యాగ్ చేస్తూ.. ఈ సంఘటనను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement