Tuesday, September 21, 2021

మంత్రి పదవికి రాజీనామా చేస్తాః బండి సంజయ్ కి కేటీఆర్ సవాల్

తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. టీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగడుతు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర కొనసాగిస్తుంటే.. ఆయనపై టీఆర్ఎస్ ఎదురు దాడి చేస్తోంది. తాజాగా కేంద్రం ఇచ్చిన నిధులపై బండి సంజయ్ చర్చకు రావాలని మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. తాను చెప్పినవి తప్పు అయితే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. బండి చెప్పినవి తప్పు అయితే ఎంపీ పదవికి రాజీనామా చేస్తారా? అని ప్రశ్నించారు. గత ఆరున్నరేళ్లలో కేంద్రానికి పన్నుల రూపంలో రూ.2.72 లక్షల కోట్లు చెల్లించామని కేటీఆర్ చెప్పారు. కేంద్రం నుంచి ఫైనాన్స్ కమిషన్ రూపంలో రూ.1.42 లక్షల కోట్లు ఇచ్చారని వివరించారు. ఎవరి పైసలతో ఎవరు కులుకుతున్నారో మీరే చెప్పాలని డిమాండ్ చేశారు. సొల్లు కబుర్లు, చిల్లర మాటలు మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. కేంద్రం తెలంగాణకు ఇచ్చిందేమీ లేదని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

ఇది కూడా చదవండిః తెలంగాణ హైకోర్టులో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ పిటిషన్

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News