Thursday, May 16, 2024

కేంద్ర‌మంత్రి గ‌జేంద్ర‌సింగ్ షెకావ‌త్ తో భేటీ అయిన – మంత్రి కాకాణి గోవ‌ర్థ‌న్ రెడ్డి

విదేశీ ప‌ర్య‌ట‌న‌కి వెళ్లారు వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి కాకాణి గోవ‌ర్థ‌న్ రెడ్డి. ఆస్ట్రేలియాలోని ఆడిలైడ్‌లో నీటిపారుద‌ల, వ్య‌వ‌సాయ రంగాల‌పై రేప‌టి నుంచి జ‌ర‌గ‌నున్న అంత‌ర్జాతీయ స‌దస్సులో పాల్గొనేందుకు ఆయ‌న విదేశీ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లారు. ఈ స‌ద‌స్సుకు కేంద్ర జ‌ల‌శ‌క్తి శాఖ మంత్రి గ‌జేంద్ర సింగ్ షెకావ‌త్ కూడా హాజ‌ర‌య్యారు. స‌ద‌స్సుకు ఓ రోజు ముందే ఆడిలైడ్ చేరుకున్న కాకాణి…అప్ప‌టికే ఆ న‌గ‌రానికి చేరుకున్న షెకావ‌త్‌తో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా నీటిపారుద‌ల‌, వ్య‌వ‌సాయ రంగాల‌కు సంబంధించిన ప‌లు అంశాల‌పై వారిద్ద‌రూ చ‌ర్చించుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement