Monday, April 29, 2024

మెగాస్టార్ ఇంటి పెరట్లో సోరకాయ.. రైతులకు చిరంజీవి సెల్యూట్

మెగాస్టార్ చిరంజీవి వ‌రుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ‘ఆచార్య’ మూవీని కంప్లీట్ చేసిన మెగాస్టార్.. తదుపరి సినిమాలను కూడా లైన్ లో పెట్టారు. అయితే, షూటింగ్ కు కొంచం గ్యాప్ దొరికినా ఇంట్లో ఎక్కువ స‌మయం గ‌డుపుతున్నారు. ఇంట్లో వంటు, గార్డెనింగ్ చేస్తుంటారు. తాజాగా ఇంటి ఆవరణలో ఆయన కూరగాయాలను పండించారు. ఇంటి పెరట్లో ఆయ‌న ఓ సొర‌కాయ గింజ నాటారు. అది పెరిగి పెద్ద‌దై రెండు కాయలు కాసింది. వాటికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. జాతీయ రైతు దినోత్సవాన్ని పురస్కరించుకొని మెగాస్టార్ షేర్‌ చేసిన ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది.

‘’పెరట్లో ఆనపకాయ కాస్తేనే నాకు ఇంత సంతోషమనిపిస్తే, మట్టి నుంచి పంట పండించి, మనందరికీ అన్నం పెట్టే రైతు ఇంకెంత సంతోషంగా ఉండాలి! అలా ఉండేలా మనమే చూసుకోవాలి. వ్యవసాయం చేస్తూ మనందరికీ సాయం చేస్తున్న ప్రతి ఒక్క రైతుకి నా సెల్యూట్.” అని మెగాస్టార్ పోస్ట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement