Saturday, May 11, 2024

మాంసం ప్రియులకు ముఖ్య గమనిక.. మాంసం దుకాణాలు బంద్!

మాంసం ప్రియులకు ముఖ్య గమనిక. సండే వచ్చిందంటే చాలు నాన్ వెజ్ ప్రియులు మాంసం దుకాణాల ముందు క్యూ కడుతుంటారు. ప్రతీ ఆదివారం ముక్క రుచి చూడనిదే అస్సలు ఉండలేకపోతుంటారు. చికెన్, మటన్ ను ఇంటికి తీసుకెళ్లి వండించి కుటుంబమంతా ఆరగిస్తుంటారు. ప్రస్తుతం చికెన్ రేట్లు అమాంతం పెరిగాయి. మార్కెట్లో కిలో స్కిన్ లెస్ చికెన్ 280 రూపాయల వరకు ఉంది. ఇక మటన్ అయితే కిలో 800 రూపాయలకు పైగానే పలుకుతోంది. చేపల రేటు మాత్రమే చికెన్ ధర కంటే కాస్త తక్కువగా అందుబాటులో ఉంది. అయినప్పటికీ మాంసం ప్రియులు మాత్రం ప్రతీ ఆదివారం ముక్క రుచి చూడనిదే అస్సలు ఉండలేకపోతున్నారు. అయితే ఈ ఆదివారం మాత్రం హైదరాబాద్ లో నివసించే ప్రజలు మాంసాహారాన్ని రుచి చూడలేరు.

మహావీర్‌ జయంతి సందర్భంగా ఆదివారం గ్రేటర్‌ పరిధిలో కబేళాలు, మాంసం, బీఫ్‌ దుకాణాలు బంద్‌ చేయాలని జీహెచ్‌ఎంసీ ఒక ప్రకటనలో పేర్కొంది. నిబంధనలు అందరూ పాటించేలా చర్యలు తీసుకోవాలని వెటర్నరీ విభాగం అధికారులకు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. తిరిగి సోమవారం యథావిధిగా కబేళాలు తెరుచుకోవచ్చని కమిషనర్ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement