Wednesday, May 1, 2024

Breaking: నల్గొండ ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో భారీ పేలుడు.. పెద్ద ఎత్తున ఎగ‌సిప‌డుతున్న మంట‌లు

నల్గొండ ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో భారీ పేలుడు సంభ‌వించింది. దీంతో ఆస్పత్రి ఆవరణలో పెద్ద ఎత్తున మంట‌లు ఎగిసిప‌డుతున్నాయి. పేలుడు ధాటికి స్థానికులు భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు. కాగా, స్థానికులు ఆస్పత్రి అవరణలోని చెత్తకు నిప్పుపెట్టడంతో మంటలు అంటుకున్న‌ట్టు తెలుస్తోంది.

ఫైర్​ సిబ్బందికి సమాచారం అందడంతో అగ్ని మాపక వాహనంతో తరలివచ్చారు. మంట‌లు ఆర్పే పనిలో స్పీడ్​ పెంచారు. ఈ పేలుడుకు సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement