Sunday, May 5, 2024

మంచుల‌క్ష్మి కొత్త ఛాలెంజ్ – సిట్ డౌన్

న‌టి, నిర్మాత‌,ద‌ర్శ‌కురాలు ఇలా మ‌ల్టీటాలెంట్ మంచుల‌క్ష్మీ సొంతం. ఈమె ఇప్పుడో కొత్త ఛాలెంజ్ ని విసిరారు. ఇప్ప‌టికే ప‌లు ర‌కాల ఛాలెంజ్ లు ఉండ‌గా.. మంచు లక్ష్మి విసిరిన ఓ చాలెంజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సిట్ డౌన్ పేరుతో మంచువార‌మ్మాయి ఓ కొత్త చాలెంజ్ విసిరారు.దీనికి సంబంధించిన ఓ వీడియోను రూపొందించి ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. కాగా ఈ వీడియోలో ప‌లు రకాల డ్రెస్సులోసిట్ డౌన్ చాలెంజ్ ని చేశారు మంచు లక్ష్మీ. సిట్ డౌన్ ఛాలెంజ్ లో భాగంగా రకరకాల వీడియోలను ఒకే ద‌గ్గ‌ర చేర్చి ఓ స్పెషల్ వీడియోగా రూపొందించారామె. ఆమె.. సిట్ డౌన్ చాలెంజ్ అంటూ సోషల్ మీడియా యూజర్లకు సవాల్ విసిరింది. ఇలాంటి ట్రెండ్స్ ను ఫాలో అయ్యేందుకు అస్సలు ఆలస్యం చేయకూడదంటూ ఆ వీడియోకు క్యాప్షన్ కూడా ఇచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement