Thursday, May 2, 2024

మే 9న మేజ‌ర్ ట్రైల‌ర్ – డేట్ రిలీజ్ చేసిన మేక‌ర్స్

మేజ‌ర్ చిత్రం ట్రైల‌ర్ రిలీజ్ డేట్ ని ఎనౌన్స్ చేశారు చిత్ర మేక‌ర్స్. ఈ చిత్రంలో హీరో్గా అడివి శేషు న‌టించాడు. శ‌శికిర‌ణ్ తిక్క ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. కాగా సూపర్ స్టార్ మహేశ్ బాబు ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించడం విశేషం. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితచరిత్ర ఆధారంగా ఈ సినిమా నిర్మితమైంది. ముంబైలోని ఒక హోటల్ పై జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో నడిచే కథ ఇది. ఈ సినిమా విడుదలకు సరైన డేట్ కోసం వెయిట్ చేస్తూ వస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ .. మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ నెల 9వ తేదీన ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. ఆ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ ఒక ప్రోమో కట్ ని రిలీజ్ చేశారు. శ్రీచరణ్ పాకాల ఈ సినిమాకి సంగీతాన్ని అందించాడు. ఈ సినిమాలో కథానాయికగా సయీ మంజ్రేకర్ .. ముఖ్యమైన పాత్రలో శోభిత ధూళిపాళ కనిపించనున్నారు. ప్రకాశ్ రాజ్ .. మురళీశర్మ కీలకమైన పాత్రలను పోషించారు. చాలా కాలం తరువాత ఒక ప్రత్యేకమైన పాత్రలో రేవతి కనిపించనుండటం విశేషం.

YouTube video

Advertisement

తాజా వార్తలు

Advertisement