Friday, April 26, 2024

ది వారియ‌ర్ నుండి ‘ఆది’ ఫస్ట్ లుక్

ఊర‌మాస్ క‌థ‌తో ప్రేక్ష‌కుల‌ముందుకు వ‌స్తోంది ది వారియ‌ర్ చిత్రం. ఈ చిత్రంలో హీరోగా రామ్ పోతినేని న‌టిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ద‌ర్శ‌కుడు లింగుస్వామి తెర‌కెక్కిస్తున్నాడు. ద్విభాషా చిత్రంగా తెలుగు .. తమిళంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని శ్రీనివాస చిత్తూరి నిర్మిస్తున్నారు. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి అప్డేట్ వచ్చింది. ఈ సినిమా నుంచి నటుడు ఆది ఫస్ట్‌ లుక్‌ ను విడుదల చేసింది చిత్ర బృందం. గురు అనే విలన్ క్యారెక్టర్‌ లో ఆది నటిస్తున్నాడు. దీనికి సంబంధించిన ఫస్టు లుక్‌ ను విడుదల చేశారు. ఈ పోస్టర్ లో ఆది చాలా క్రూరంగా కనిపిస్తూ.. అందరినీ ఆకట్టుకుంటున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement