Saturday, May 4, 2024

‘మాచ‌ర్ల నియోజ‌వ‌ర్గం’ – రిలీజ్ డేట్ ఫిక్స్

యంగ్ హీరో నితిన్ న‌టిస్తోన్న మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం చిత్రాన్ని జూలై 8వ తేదీన విడుద‌ల చేస్తున్న‌ట్టు అధికారికంగా పోస్ట‌ర్ ని రిలీజ్ చేశారు. నితిన్ సొంత బ్యానర్ లో నిర్మితమవుతున్న ఈ సినిమాకి రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. నితిన్ డిఫరెంట్ లుక్ తో కనిపిస్తున్న ఈ సినిమాలో, ఒక కథానాయికగా కృతి శెట్టి .. మరో కథానాయికగా కేథరిన్ అలరించనున్నారు. గ్రామీణ రాజకీయాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. యాక్షన్ తో పాటు ఎమోషన్ పుష్కలంగా ఉన్న కథ ఇది. కొంతకాలంగా నితిన్ సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఈ సినిమాతో ఆయన నిరీక్షణ ఫలిస్తుందేమో చూడాలి. ఈ సినిమా తరువాత ఆయన వక్కంతం వంశీ దర్శకత్వంలో ‘జూనియర్’ చేయనున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా శ్రీలీల పేరు వినిపిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement