Friday, May 3, 2024

ప్రేమ‌ని తిర‌స్క‌రించింద‌ని – బాలిక‌పై ప్రేమోన్మాది కాల్పులు

త‌న ప్రేమ‌ని తిర‌స్క‌రించింద‌నే కోపంతో ఓ ప్రేమోన్మాది ..15ఏళ్ల బాలిక‌పై కాల్పులు జ‌రిపాడు. మెడపై తూటా దిగటంతో ఆ బాధితురాలు ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతోంది. ఈ దుశ్చర్య బీహార్ రాజధాని పాట్నాలో జరిగింది. బాలికపై తుపాకీతో కాల్పులు జ‌రుపుతోన్న దృశ్యాలు స్థానికంగా ఉన్న సీసీటీవీ కెమెరాల్లో నమోదయ్యాయి. ఆ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. బ్యూర్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఇంద్రపురి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. కూరగాయలు విక్రయించే వ్యక్తి కుమార్తె 9వ తరగతి చదువుతోంది. అదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ప్రేమించాలని కొంతకాలంగా ఆమె వెంటపడుతున్నాడు. అతడి ప్రేమను తిరస్కరిస్తుందనే కోపంతో తుపాకీతో వచ్చాడు. బాలిక అతడితో మాట్లాడకుండా వెడుతుండగా.. వెనకనుంచి మెడపై కాల్పులు జరిపాడు. తూటా దిగడంతో బాలిక అక్కడికక్కడే పడిపోయింది. ఆ తర్వాత దుండగుడు అక్కడి నుంచి పారిపోయాడు. బాధితురాలిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement