Sunday, April 28, 2024

జ‌గ‌న‌న్న‌కి సైనికుడిలా ఉంటా – ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి

తాను మంత్రి ప‌ద‌విని ఆశించ‌లేద‌ని తెలిపారు మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి ఆలియాస్ ఆర్కే. .. సామాజిక సమీకరణాల నేపథ్యంలో అందరికీ పదవులు ఇవ్వడం సాధ్యం కాదన్నారు.. తనకు మంత్రి పదవి అవసరం లేదు.. నియోజకవర్గ అభివృద్దే నాకు ముఖ్యం అన్నారు.. అదే విషయం కొన్ని నెలల క్రితం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిని కలసి చెప్పాను అని గుర్తుచేసుకున్నారు.. మంత్రి పదవితో సంబంధం లేకుండా.. నేను ఎప్పటికీ జగనన్న సైనికుడిలా ఉంటాను అని ప్రకటించారు. ఏపీ కేబినెట్‌ విస్తరణ అధికార పార్టీలోని అసంతృప్తులను బయటపెట్టింది.. కేబినెట్‌లో స్థానం కోల్పోయినవారిని, పదవి ఆశించి నిరాశ ఎదురై అసంతృప్తిగా ఉన్న నేతలను పార్టీ అధిష్టానం బుజ్జగించి.. మళ్లీ అందరినీ లైన్‌లోకి తీసుకొచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement