Saturday, April 27, 2024

లైగర్ మూవీ గ్లింప్స్.. అద‌ర‌గొట్టిన టాలీవుడ్ రౌడీ..

పూరి జగన్నాథ్ డైరెక్ష‌న్‌లో విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా వ‌స్తున్న న‌టిస్తున్న సినిమా లైగర్‌. ఈ మూవీ నుంచి వరుసగా అప్‌డేట్స్ వస్తున్నాయి. న్యూ ఇయర్ సందర్భంగా లైగర్‌ (Liger) సినిమాకి సంబంధించిన క్రేజీ అప్‌డేట్ ని చార్మీ ట్విట్ట‌ర్‌లో షేర్ చేసింది. లైగర్ మూవీ ఫస్ట్‌ గ్లింప్స్ (Liger Movie First Glimpse) ఈరోజు రిలీజ్ అయ్యింది. ఈ మేరకు మూవీ యూనిట్ దీనికి సంబంధించిన వివ‌రాల‌ను ట్వీట్ చేసింది.

విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌లో లైగర్ మూవీ గ్లింప్స్ జోష్ పెంచింది. రౌడీ చింపేశాడు.. ఛాయ్‌వాలా ఫైటర్‌‌గా దుమ్మురేపాడు.. లేడీస్ అండ్ జెంటిల్మెన్ అంటూ మొదలయ్యే గ్లింప్స్‌లో విజయ్ లుక్ అదిరిపోయింది.. వియ్ ఆర్ ఇండియ‌న్స్‌ అంటూ చెప్పే డైలాగ్ మస్తు పవర్ ఫుల్ గా ఉంది.

ఇప్పటికే లైగర్‌ మూవీ నుంచి బీటీఎస్ స్టిల్స్, స్పెషల్ ఇన్‌స్టా ఫిల్టర్‌‌లు రిలీజ్ అయ్యాయి. మార్షల్‌ ఆర్ట్స్‌ నేపథ్యంలో సాగే యాక్షన్‌ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీ లైగర్. బాక్సర్ మైక్‌టైసన్‌ లైగర్‌‌లో కీలక పాత్ర పోషిస్తున్నారు. విజయ్ దేవ‌ర‌కొండ‌, మైక్‌టైసన్‌ మధ్య ఆకట్టుకునే సీన్స్ ఉండనున్నాయి. ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. 2022, ఆగస్ట్‌ 25న లైగర్ రిలీజ్ కానుంది. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో సినిమా రిలీజ్ చేయ‌నున్న‌ట్టు చిత్ర బృందం తెలిపింది.

కాగా, లైగర్ మూవీలో విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) సరసన (Liger Movie) అనన్యపాండే హీరోయిన్‌గా నటిస్తోంది. రమ్యకృష్ణ, రోనిత్‌ రాయ్‌, విష్ణు రెడ్డి, మకరంద్‌ దేశ్‌పాండే ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కరణ్‌ జోహార్‌, అపూర్వ మెహతాతో కలిసి పూరి జగన్నాథ్‌, (Puri Jagannadh) చార్మి ఈ మూవీని నిర్మిస్తున్నారు. లైగర్ మూవీకి మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement