Wednesday, May 8, 2024

దేశంలో మ‌రో 16,764 కోవిడ్ కేసులు

దేశంలో రోజురోజుకు కోవిడ్‌ విజృంభన పెరిగిపోతోంది. మొన్న 9 వేల కేసులు, నిన్న 13 వేల కేసులు, ఇవాళ 16 వేల కేసులు… ఇలా రోజురోజుకు కరోనా వేగం పెంచుకుంటుపోతోంది. దీంతో పాటు గడిచిన 24 గంటల్లో 220 మంది కరోనా బారినపడి మృతి చెందారు. తాజాగా 7,585 మంది కరోనా నుంచి కొలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. ఈ మూడు రోజుల్లోనే కరోనా కేసుల 2.6శాతం మేర పెరగడం ఆందోళన కలిగిస్తోంది. కరోనా నేపథ్యంలో ఇప్పటికే పలు రాష్ట్రాలు కోవిడ్‌ ఆంక్షలను తీవ్రతరం చేశారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ కరోనా కట్టడికి రెండు డోసులు కోవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకోవాలని వైద్యారోగ్య శాఖ సూచిస్తోంది. ఇదిలా ఉండగా.. డిసెంబ‌ర్ 31, న్యూఇయర్‌ వేడుకలు జరుగనున్న నేప‌థ్యంలో ఈ ఈవెంట్లలో, పబ్‌లలో ఎక్కువగా మంది గుమిగూడడంతో కరోనా కేసులు మరింత ఎక్కువగా వచ్చే అవకాశముంద‌ని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


ఇదిలా ఉంటే పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం ఒమిక్రాన్‌ కేసుల కట్టడికి కీలక నిర్ణయం తీసుకుంది. యూకే నుంచి కోల్‌కతాకు వచ్చే విమానాలపై సస్పెండ్ విధించింది. అటు ఢిల్లీలో 24గంటల్లో 13వందల కరోనా కేసులు రికార్డయ్యాయి. ఏడు నెలల తర్వాత కరోనా కేసుల సంఖ్య వెయ్యి మార్కును దాటింది. మే 26 తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదవడం ఇదే తొలిసారి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement